గబ్బా టెస్టులో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 74 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... నాథన్ లియాన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

60 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది భారత జట్టు. 100వ టెస్టు ఆడుతున్న నాథన్ లియాన్‌కి ఇది 395వ టెస్టు వికెట్ కావడం విశేషం. నాథన్ లియన్ బౌలింగ్‌లో అవుట్ అవ్వడం రోహిత్ శర్మకి ఇది ఆరోసారి. రోహిత్‌ను టెస్టుల్లో అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా నిలిచాడు లియాన్. 

పూజారా 32 బంతుల్లో 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రోహిత్ శర్మ అవుట్ కావడంతో కెప్టెన్ అజింకా రహానే క్రీజులోకి వచ్చాడు. ఈ ఇద్దరు సీనియర్ బ్యాట్స్‌మెన్ రాణించడంపైనే భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు ఆధారపడి ఉంది.