రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్‌లోనే యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది టీమిండియా. ఓల్లీ స్టోన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు గిల్. ఐదో టెస్టు ఆడుతున్న శుబ్‌మన్ గిల్‌కి ఇది టెస్టు కెరీర్‌లో మొట్టమొదటి డకౌట్.

ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో డకౌట్ అయిన 21వ భారత ఓపెనర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్. చివరిగా 2018లో కెఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌పై డకౌట్ అయ్యాడు. టెస్టుల్లో ఎల్బీడబ్ల్యూ రూపంలో డకౌట్ అయిన ఐదో భారత బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్. రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.

12 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ శర్మ 36 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 41 పరుగులు, పూజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు