గబ్బా టెస్టులో భారత జట్టుకి శుభారంభం దక్కలేదు. మూడో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 70+ భాగస్వామ్యం అందించిన భారత ఓపెనర్లు, కీలకమైన నాలుగో టెస్టు ఆ ఫీట్ నమోదుచేయలేకపోయారు.

15 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్... ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.మూడో టెస్టు ఆడుతున్న శుబ్‌మన్ గిల్‌కి టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు. ప్యాట్ కమ్మిట్స్ బౌలింగ్‌కి దిగిన రెండో బంతికి వికెట్ దక్కడం విశేషం.

శుబ్‌మన్ గిల్ అవుటైన తర్వాతి బంతికే పూజారా అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే.