పెళ్లిళ్లు, జీ20 సమ్మిట్ కారణంగా ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ బుక్... గతి లేక టీమిండియా హోటల్ మార్చిన బీసీసీఐ.. తన స్వగృహంలో కుటుంబంతో కలిసి ఉంటున్న విరాట్ కోహ్లీ.. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పర్యాటన టీమ్‌ ఆస్ట్రేలియాని మట్టికరిపించింది టీమిండియా. ఢిల్లీలో జరిగే టెస్టు గెలిస్తే సిరీస్‌ నిలుస్తుంది, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి భారత జట్టు అధికారికంగా అర్హత సాధిస్తుంది. మిగిలిన రెండు టెస్టులు ఆస్ట్రేలియా గెలిచినా సిరీస్‌ పోయేది ఉండదు...

అయితే నాగ్‌పూర్ టెస్టు తర్వాత స్టింగ్ ఆపరేషన్‌లో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ చేతిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం గురించి ఓపెన్ అయిన చేతన్ శర్మ, టీమ్‌లోని కొందరు ప్లేయర్లు ఫిట్‌గా ఉండేందుకు స్టెరాయిడ్స్ వాడతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు..

ఈ వ్యాఖ్యల ప్రభావంతో టీమిండియా, ఏం చేసినా అనుమానించడం మొదలెట్టారు అభిమానులు. తాజాగా ఢిల్లీలో బస చేయాల్సిన హోటల్‌ని మార్చేసింది బీసీసీఐ. ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్టు జరగాల్సి ఉంది. 2017 డిసెంబర్ తర్వాత ఇక్కడ జరుగుతున్న టెస్టు మ్యాచ్ ఇదే...

సాధారణంగా ఢిల్లీకి వచ్చినప్పుడు భారత జట్టు.. తాజ్ ప్యాలెస్ లేదా ఐటీసీ మౌర్య హోటల్స్‌లో ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం భారత జట్టు, కర్‌కర్‌దుమా ఏరియాలో ఉన్న హోటల్ లీలాలో వసతి సౌకర్యాలు కల్పించింది బీసీసీఐ...

పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు జీ20 సమ్మిట్ కోసం దేశ రాజధానిలోని హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయని, అందుకే ఈసారి హోటల్ లీలాలో బస ఏర్పాటు చేసింది బీసీసీఐ. అలాగే చాలా రోజుల తర్వాత ఢిల్లీలో టెస్టు మ్యాచ్ ఆడబోతున్న విరాట్ కోహ్లీ, టీమ్‌తో కలిసి ఉండడం లేదు... అయితే చేతన్ శర్మ వ్యాఖ్యల వల్లే టీమ్‌లో చీలికలు రాకుండా ఇలా జాగ్రత్త పడుతున్నారని అనుమానిస్తున్నారు కొందరు నెటిజన్లు.. 

కారణం అతని ఇల్లు ఢిల్లీలోనే ఉంది. తల్లి, కుటుంబంతో కలిసి గుర్‌గ్రామ్‌లో ఉన్న తన నివాసంలో ఉంటున్న విరాట్ కోహ్లీ, చాలా రోజుల తర్వాత ఇంటి నుంచి స్టేడియానికి కారులో వెళ్తున్నానంటూ సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో విరాట్ కోహ్లీ పేరిట ఓ పెవిలియన్ ఏర్పాటు చేసింది ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్. రెండో టెస్టు సమయంలో విరాట్ కోహ్లీ పెవిలియన్ దగ్గరే ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కూర్చోబోతోంది...

గత 36 ఏళ్లలో ఢిల్లీలో ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు భారత జట్టు. అంతేకాకుండా సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ పేరిట వరల్డ్ రికార్డులు క్రియేట్ అయ్యింది ఇక్కడే. 1983లో సునీల్ గవాస్కర్, టెస్టుల్లో 29వ సెంచరీ చేసి, డాన్ బ్రాడ్‌మెన్ రికార్డును సమం చేసింది ఇక్కడే...

1999లో ఇదే స్టేడియంలో అనిల్ కుంబ్లే, పాకిస్తాన్‌తో టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అనిల్ కుంబ్లే, ఈ స్టేడియంలో 58 వికెట్లు తీశాడు. 2005లో సచిన్ టెండూల్కర్, శ్రీలంకపై సెంచరీ (35వ సెంచరీ) చేసి టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసింది కూడా ఇదే స్టేడియంలో.. 

2017 డిసెంబర్ 2న ఇదే స్టేడియంలో 243 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ... ఇదే ఈ స్టేడియంలో జరిగిన ఆఖరి టెస్టు కూడా..