Asianet News TeluguAsianet News Telugu

చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టుల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ కొట్టిన షెఫాలీ వ‌ర్మ

IND W vs SA W:  20 ఏళ్ల షెఫాలీ వ‌ర్మ చ‌రిత్ర సృష్టించింది. కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించింది. అలాగే, స్మృతి మంధాన సెంచ‌రీతో అద‌ర‌గొట్ట‌డంతో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ లో తొలి రోజు భార‌త మ‌హిళా జ‌ట్టు 4 వికెట్లు కోల్పోయి 525 ప‌రుగులు చేసింది. 
 

Team India has created history. Shafali Verma hits the fastest double century in Tests RMA
Author
First Published Jun 28, 2024, 10:07 PM IST

IND W vs SA W: దక్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న ఏకైక టెస్టులో భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ప‌రుగుల వ‌ర‌ద పారించింది. ఇద్ద‌రు భార‌త ప్లేయ‌ర్లు సెంచ‌రీల మోత మోగించారు. ఆస్ట్రేలియా క్రీడాకారిణి అన్నాబెల్ సదర్లాండ్ రికార్డును బ్రేక్ చేస్తూ భార‌త మ‌హిళా జ‌ట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ షఫాలీ వర్మ మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. 20 ఏళ్ల షెఫాలీ తన డబుల్ సెంచరీని కేవలం 194 బంతుల్లో పూర్తి చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ 248 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టింది. భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తర్వాత దాదాపు 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయురాలిగా కూడా షఫాలీ రికార్డుల‌కెక్కారు.

ఆగస్ట్ 2002లో టాంటన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు డ్రా అయింది. అయితే, ఈ మ్యాచ్ లో మిథాలీ 407 బంతుల్లో 214 పరుగులు చేసింది. కానీ, ఇప్పుడు షెఫాలీ తన దూకుడైన బ్యాటింగ్ ఇన్నింగ్స్‌తో 23 ఫోర్లు, 8 సిక్సర్లతో 197 బంతుల్లోనే డ‌బుల్ సెంచ‌రీ కొట్టింది. డెల్మీ టక్కర్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు బాది డ‌బులు సెంచ‌రీని పూర్తి చేసిందిత‌. అయితే, 205 పరుగుల వ‌ద్ద రనౌట్ అయింది. అలాగే, 161 బంతుల్లో 27 ఫోర్లు, ఒక సిక్స్‌తో ఓపెనర్ స్మృతి మంధాన కూడా సెంచ‌రీతో అద‌ర‌గొట్టింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 312 బంతుల్లో 292 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా జట్టుకు శుభారంభం అందించారు. మహిళల టెస్టు క్రికెట్‌లో తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావ‌డం విశేషం.

 

 

దీంతో భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు తొలి రోజు ఆట ముగిసే స‌మయానికి 4 వికెట్లు కోల్పోయి 525 ప‌రుగులు చేసింది. శుభా సతీష్ 15 ప‌రుగులు, జెమిమా రోడ్రిగ్స్ 55 ప‌రుగులు చేసి ఔట్ అయ్యారు. ప్ర‌స్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ 42* ప‌రుగులు, రిచా ఘోష్ 43* ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. కాగా, 2004లో కరాచీలో వెస్టిండీస్‌పై సాజిదా షా-కిరణ్ బలోచ్‌ల 241 పరుగుల భాగస్వామ్యాన్ని షెఫాలీ-మంధాన జోడీ అధిగ‌మించింది. 1987లో వెథర్‌బీలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వికెట్‌కు ఆస్ట్రేలియా జోడీ రీలర్-అన్నెట్స్ మధ్య 309 పరుగుల భాగస్వామ్యం టాప్ లో ఉంది.

ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. ఓదార్చిన విరాట్ కోహ్లీ.. వీడియో

2021లో బ్రిస్టల్‌లో ఇంగ్లండ్‌పై షెఫాలీ-మంధాన తమ మునుపటి 167 పరుగుల భాగస్వామ్యాన్ని మ‌రింత‌ మెరుగుపరిచారు. వీరిద్దరూ గతంలో ఏ వికెట్‌కైనా భారత అత్యధిక భాగస్వామ్య రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు. 2014లో మైసూర్‌లో దక్షిణాఫ్రికాపై 275 పరుగుల భాగస్వామ్యాన్ని చేసిన పూనమ్ రౌత్-తిరుష్ కామిని పేరిట ఈ రికార్డు అంతకుముందు ఉంది. అలాగే, టెస్టు క్రికెట్ లో తొలి రోజు అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్టుగా భార‌త్ (525 ప‌రుగులు) రికార్డు సృష్టించింది.

 

 

T20 WORLD CUP : 17 ఏళ్ల హిస్టరీలో ఇదే తొలిసారి.. ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios