Rohit Sharma Emotional Video : టీ20 ప్రపంచకప్ 2024 లో వరుస విజయాలతో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Rohit Sharma Virat Kohli Emotional Video : టీ20 ప్రపంచ కప్ 2024 లో అద్భుత ప్రయాణంతో ఫైనల్ కు చేరుకుంది టీమిండియా. రెండో సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి 10 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు టీ20 ప్రపంచ కప్ 2014లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ఫైనల్ లో శ్రీలంక చేతిలో ఓటమితో భారత్ కల చెదిరింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో 2 సంవత్సరాల క్రితం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ ఓటమికి కూడా భారత్ కూడా ప్రతీకారం తీర్చుకుంది.
భారత జట్టు విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ తన సూపర్ కెప్టెన్సీతో, అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 39 బంతుల్లో 57 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియా స్కోర్‌ను 171 పరుగులకు తీసుకెళ్లాడు. రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. బౌలింగ్ లో అయితే, టీమిండియా ఇరగదీసింది. ఇంగ్లండ్ కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా వరుసగా వికెట్లు తీసుకుని బిగ్ షాకిచ్చింది. అక్షర్ పటేల్ 3, కుల్దీప్ యాదవ్ 3, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీసుకోవడంతో ఇంగ్లండ్ పై 68 పరుగుల తేడాతో గెలిచింది.
ధోని, కోహ్లీలను దాటేసి క్రిస్ గేల్ రికార్డును బద్డలు కొట్టిన రోహిత్ శర్మ
ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో టీమిండియా ఇప్పుడు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జూన్ 29న బార్బడోస్‌లో చివరి మ్యాచ్ జరగనుంది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి, టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌కు చేరుకున్న తర్వాత చాలా భావోద్వేగంగా కనిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ బయట కుర్చీలో కూర్చుని ఏడుస్తూ కనిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో కరచాలనం చేసేందుకు తోటి ఆటగాళ్లు వచ్చినప్పుడు, అతను కన్నీళ్లు దాచుకుని కనిపించాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో 2024 టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టును ఫైనల్‌కి తీసుకెళ్లిన తర్వాత చాలా భావోద్వేగానికి గురయ్యాడు. రోహిత్ శర్మ ఏడుపు చూసిన విరాట్ కోహ్లీ అతని దగ్గరకు వచ్చి ఓదార్చాడు. హిట్ మ్యాన్ ను నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో, రోహిత్ శర్మ కెమెరా నుండి తన ముఖాన్ని దాచుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల మధ్య ఉన్న ఈ బంధాన్ని అభిమానులు ఎంతో ఇష్టపడుతున్నారు. రోహిత్ కళ్ల నుంచి కారుతున్న కన్నీళ్లు అందరి హృదయాలను గెలుచుకున్నాయి. ఈ వీడియో దృశ్యాలపై కామెంట్ల వర్షం కురుస్తోంది.
కెన్సింగ్టన్ ఓవల్ లో భారత్-దక్షిణాఫ్రికాల ఫైనల్ పోరు.. వర్షం పడనుందా? పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది?
T20 World Cup 2024 : భారత్ దెబ్బకు బిత్తరపోయిన ఇంగ్లండ్..
