Asianet News TeluguAsianet News Telugu

ఓవల్ విజయంతో మళ్లీ టాప్‌‌లేపిన టీమిండియా... ఆఖరి స్థానానికి పడిపోయిన ఇంగ్లాండ్...

డబ్ల్యూటీసీ 2021-23 పాయింట్ల పట్టికలో టాప్‌లోకి టీమిండియా... నాలుగో స్థానానికి పడిపోయిన ఇంగ్లాండ్, రెండో స్థానంలో వెస్టిండీస్, మూడో స్థానంలో పాకిస్తాన్...

Team India goes to top place in ICC Test Championship Points table, England in last
Author
India, First Published Sep 7, 2021, 12:32 PM IST | Last Updated Sep 7, 2021, 12:32 PM IST

ది ఓవల్ టెస్టులో ఘన విజయంతో ఐసీసీ డబ్ల్యూటీసీ 2021-23 పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచులు ఆడిన టీమిండియా... రెండింట్లో విజయాలు అందుకుని, ఓ మ్యాచ్‌లో ఓడింది. ఓ టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది...

మొత్తం 26 పాయింట్లు సాధించిన టీమిండియా, 54.16 విజయాల శాతం టాప్‌లో నిలిచింది. వెస్టిండీస్ ఓ విజయం, ఓ పరాజయంతో 12 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, పాకిస్తాన్ కూడా ఓ గెలుపు, ఓ ఓటమితో మూడో స్థానంలో ఉంది.

ఈ సీజన్‌లో నాలుగింట్లో రెండు మ్యాచుల్లో ఓడి, ఓ మ్యాచ్ గెలిచి, ఓ మ్యాచ్ డ్రా చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పాయింట్లు ఎక్కువగా ఇంగ్లాండ్ విజయాల శాతం కేవలం 29.16 కావడంతో ఆఖరి స్థానానికి పడిపోయింది ఇంగ్లాండ్...

రెండేళ్ల పాటు సాగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌‌లో మ్యాచులన్నీ ముగిసే సమయానికి అత్యధిక విజయాల శాతంలో టాప్‌లో రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గత 2019-21 డబ్ల్యూటీసీ టోర్నీలో ఇండియా టేబుల్ టాపర్‌గా ఫైనల్ చేరగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది.

ఫైనల్‌లో టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్, 22 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ సాధించింది... ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్ కోసం టీ20, వన్డే సిరీస్‌లు ఆడుతూ సిద్ధమవుతున్న టీమ్స్ అన్నీ... ఈ టోర్నీ ముగిసిన తర్వాత టెస్టు సిరీస్‌లు ఆడడం మొదలెడతాయి...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios