దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు మాస్క్‌తో చాహల్, అభిమానుల ఆందోళన

టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్‌ తన ముఖానికి మాస్క్ తొడిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన టీమిండియా అభిమానులు గాబరా పడ్డారు. 

Team India cricketer Yuzvendra Chahal posts photo with face mask

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా ప్రభావం క్రీడా రంగంపైనా పడింది. ఇప్పటికే ఎన్నో మెగా టోర్నీలు రద్దవ్వడమో లేదంటే వాయిదా పడటమో జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్-2020 సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే.

మార్చి 29 నుంచి ప్రారంభమవ్వాల్సిన ఐపీఎల్‌పైనా క్లారిటీ లేదు. ఇదే సమయంలో టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్‌ తన ముఖానికి మాస్క్ తొడిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

Also Read:చితక్కొట్టిన ఇర్ఫాన్ పఠాన్.. శ్రీలంకపై లెజెండ్స్ విజయం

దీనిపై స్పందించిన టీమిండియా అభిమానులు గాబరా పడ్డారు. చాహల్‌కు ఏమైనా కరోనా సోకిందా అని కంగారుపడ్డారు. కానీ అదేం లేదంటే చాహల్ స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మన జాగ్రత్తలో మనం ఉంటే ఎలాంటి వైరస్‌లు అయినా మన దగ్గరకు రాలేవని చాహల్ తెలిపాడు. అలాగే కరోనా ప్రభావం తగ్గేవరకు ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి చేయకపోవడంపై మంచిదని అతను అభిప్రాయపడ్డాడు.

మరోవైపు దక్షిణాఫ్రికాతో త్వరలో భారత్ మూడు వన్డేల సిరీస్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ధర్మశాలకు వెళ్లే సమయంలో న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టులో ముఖానికి మాస్క్ వేసుకుని చాహల్ కనిపించాడు.

Also Read:మొన్న మహారాష్ట్ర, నేడు కర్ణాటక, రేపు ఎవరో: ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు

కరోనాపై దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ కూడా స్పందించాడు. వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్నందున ఆటగాళ్ల పట్ల తగినన్న జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపాడు.

ఆటగాళ్లతో పాటు స్టేడియంకు వచ్చే ప్రేక్షకులతోనూ ఎలాంటి కరచాలనం చేయకూడదని జట్టును ఆదేశించినట్లు బౌచర్ వెల్లడించారు. క్రికెటర్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ఒక మెడికల్ హెల్త్ సూపర్‌వైజర్‌ను ఏర్పాటు చేసుకున్నామని మార్క్ బౌచర్ స్పష్టం చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios