Asianet News TeluguAsianet News Telugu

చితక్కొట్టిన ఇర్ఫాన్ పఠాన్.. శ్రీలంకపై లెజెండ్స్ విజయం

డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో  ఈ మ్యాచ్ జరిగింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్... శ్రీలంక లెజెండ్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించారు. కాగా ఇర్ఫాన్ పఠాన్ 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Road Safety World Series: Irfan Pathan guides India Legends to victory over Sri Lanka Legends
Author
Hyderabad, First Published Mar 11, 2020, 8:17 AM IST

చాలా కాలం తర్వాత ఇర్ఫాన్ పఠాన్ తన బ్యాటింగ్ కి మరోసారి పనిచెప్పాడు. పరుగుల వరద కురిపించి.. జట్టు విజయానికి సహకరించాడు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లంతా సందడి చేసిన సంగతి తెలిసిందే.

Also Read మొన్న మహారాష్ట్ర, నేడు కర్ణాటక, రేపు ఎవరో: ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు...

ఈ నేపథ్యంలో మంగళవారం ముంబయి వేదికగా శ్రీలకంతో జరిగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో  ఈ మ్యాచ్ జరిగింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్... శ్రీలంక లెజెండ్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించారు. కాగా ఇర్ఫాన్ పఠాన్ 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

139 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ మొదటి ఓవర్ లోనే  సచిన్ టెండూల్కర్ (0) ను కోల్పోయింది. వెంటనే, వీరేందర్ సెహ్వాగ్ (3), యువరాజ్ సింగ్ (1) లు  కూడా పెవీలియన్ చేరుకున్నారు.ఆ తర్వాత మహ్మద్ కైఫ్, సంజయ్ బంగర్ లు కొద్ది సేపటి వరకు నిలకడగా ఆడారు. తర్వాత బంగర్ ఔట్ కావడంతో జట్టు మరోసారి వెనుకపడిపోయింది. ఆ వెంటనే  కైఫ్ కూడా ఔటయ్యాడు. ఇక చివరి ఓవర్ లో ఇర్ఫాన్ పఠాన్ రంగ ప్రవేశం చేశాడు. 

మన్ ప్రీత్ గోనీ మద్దుతుతో పఠాన్ చెలరేగిపోయాడు.  పఠాన్, గోనీ 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం. దీంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో, ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.అంతకుముందు, మునాఫ్ పటేల్ నాలుగు వికెట్ల తేడాతో ఇండియా లెజెండ్స్ కేటాయించిన ఇరవై ఓవర్లలో శ్రీలంక లెజెండ్స్‌ను 138/8 కు పరిమితం చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios