టీమిండియా యువ స్పిన్నర్ యజువేందర్ చాహల్ మంచి ఆటగాడే కాదు మాటగాడు కూడా. దీంతో అతడు ఇట్టే టీమిండియా సీనియర్లతో కలిసిపోయి మంచి స్నేహాన్ని ఏర్పర్చుకున్నాడు. టీమిండియా స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి స్టార్ క్రికెటర్లకు చాలా దగ్గరయ్యాడు. అంతేకాదు వారి కుటంబ సభ్యులతో కూడా చాహల్ మంచి స్నేహాన్ని  ఏర్పర్చుకున్నాడు. ముఖ్యంగా రోహిత్ తో పాటు అతడి భార్య రితికా సర్దేశాయ్ తో చాహల్ చాలామంచి స్నేహాన్ని  కలిగివున్నాడు. 

తాజాగా సౌతాఫ్రికాతో థర్డ్ టీ20 కోసం టీమిండియా ఆటగాళ్లు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రితికా కూడా అక్కడికి చేరుకుని భర్త రోహిత్, కూతురు సమైరాతో కలిసి ఓ సెల్పీ దిగింది.  ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోపై చాహల్ సరదాగా కామెంట్ చేయగా రితిక  కూడా అంతే  అద్భుతంగా తిరిగి కౌంటరిచ్చింది.

మొదట చాహల్ రితిక ఇన్ట్సాగ్రామ్ లో పెట్టిన పోటోపై స్పందిస్తూ ''బాబీ(వదిన)... మీరు  నన్నెందుకు తొలగించారు.'' అని కామెంట్ చేశాడు. దీనికి రితికా '' నువ్వు ప్రస్తుతం భారత జట్టులో లేవు కదా... అందుకే ఈ ఫోటోలో కూడా లేవు.''అంటే సందర్భోచితంగా రిటర్న్  కౌంటర్ ఇచ్చింది. ఇలా వీరిద్దరి మధ్య సాగిన ఫన్నీ చాటింగ్ అభిమానులకు కూడా సరదాను పంచుతోంది. ముఖ్యంగా రితికా టైమింగ్ పంచ్ కు చాహల్ దిమ్మతిరిగిపోయి వుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

గతంలోనూ చాహల్ పుట్టినరోజు సందర్భంగా రితికా కాస్త ఫన్నీగా విషెస్ చెప్పింది. '' హ్యాపియెస్ట్ భర్త్‌డే చాహల్... ఈ ప్రత్యేక సందర్భంలో నీ మంచి స్నేహితుడు  రోహిత్ ను మిస్ అవుతున్నావని తెలుసు. కానీ ఏం చేయను ఇప్పుడు ఆయన నావాడు.'' అని చమత్కారంగా రితిక విషెస్ తెలిపింది.