ధోనిపై ఆసక్తి వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్. ముంబైలో సోమవారం జరిగిన సెయెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా కుల్‌దీప్ మాట్లాడాడు

ఎంత ఒత్తిడిలో ఉన్నా కూల్‌గా నిర్ణయాలు తీసుకుంటూ... చివరి నిమిషాల్లో సైతం మ్యాచ్‌ను మలుపు తిప్ప గల వ్యూహాలు పన్నడం ధోని స్టైల్. అతని స్వభావాన్ని క్రికెట్ అభిమానులే కాకుండా.. మానసిక నిపుణులు సైతం మెచ్చుకుంటూ ఉంటారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అలాంటి ధోనిపై ఆసక్తి వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్. ముంబైలో సోమవారం జరిగిన సెయెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా కుల్‌దీప్ మాట్లాడాడు.

ధోని కూడా మానవ మాత్రుడేనని, ఆయన కూడా తప్పులు చేస్తారని, మహి సూచనలు ఎన్నో సార్లు పనిచేయలేదని పేర్కొన్నాడు. అంతేకాకుండా ధోని ఎక్కువగా మాట్లాడేవాడని, మ్యాచ్‌లో అవసరమైన సందర్భంలోనే ఆయన ఓవర్ల మధ్యలో తన అభిప్రాయాలను పంచుకునేవాడని కుల్‌దీప్ తెలిపాడు.