శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో బుడ్డోడితో కలిసి వున్న జిఫ్‌ను పోస్ట్ చేశాడు. క్రికెట్ గురించి మాట్లాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌కు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తనదైన శైలిలో స్పందించాడు

టీమిండియా ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా కాబోయే భార్య నటాషా ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు. తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన ఆనందాన్ని తెలియజేస్తున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా సైతం చిన్నారితో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో బుడ్డోడితో కలిసి వున్న జిఫ్‌ను పోస్ట్ చేశాడు.

క్రికెట్ గురించి మాట్లాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌కు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావాలని దయచేసి అతనికి చెప్పు ’’ అని కామెంట్ పెట్టాడు.

ప్రస్తుతం రాహుల్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హార్దిక్ పాండ్యా ప్రియురాలు, సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిక్ జూలై 30న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని హార్దిక్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

మరోవైపు పాండ్యా, కేఎల్ రాహుల్ ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నారు. పాండ్యా ముంబై ఇండియన్స్‌కి, రాహుల్ పంజాబ్ తరపున ఆడుతున్నారు. అలాగే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

View post on Instagram