Asianet News TeluguAsianet News Telugu

రవిశాస్త్రిని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేసిన మహిళా జర్నలిస్ట్... టీమిండియా హెడ్ కోచ్ షాకింగ్ రిప్లై...

రెండురోజుల్లో ముగిసిన పింక్ బాల్ టెస్టుకి, రవిశాస్త్రి అలవాటుకి లింకు పెట్టిన జర్నలిస్టు...

మహిళా జర్నలిస్టు పోస్టు నచ్చిందంటూ స్పందించిన కోచ్ రవిశాస్త్రి...

కొంతమంది ముఖాల్లో అయినా నవ్వులు పూయిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ...

Team India coach Ravi Shastri Shocking Reply to woman journalist who trolled him CRA
Author
India, First Published Feb 27, 2021, 12:14 PM IST

టీమిండియా హెడ్ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రికి ట్రోలింగ్ కొత్తేమీ కాదు. టీమిండియా ఎప్పుడు మ్యాచ్ ఓడినా, మొట్టమొదట ట్రోలింగ్‌కి టార్గెట్ అయ్యేది రవిశాస్త్రియే. అయితే టీమిండియా విజయాలు సాధించినప్పుడు కోచ్ రవిశాస్త్రికి దక్కే క్రెడిట్ మాత్రం తక్కువే.

తనపై వచ్చే ట్రోల్స్ గమనించినా, వాటిని పెద్దగా పట్టించుకోడు రవిశాస్త్రి...మద్యపాన ప్రియుడైన రవిశాస్త్రిపై బోలెడు మీమీలు, జోకులు, ఫన్నీ వీడియోలు కూడా వచ్చాయి. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే.

దీనిపై శోభా డే అనే మహిళా జర్నలిస్గు ఫన్నీగా రవిశాస్త్రి నవ్వుతున్న ఫోటోను పోస్టు చేసి... ‘మీరేమనుకున్నారు... డ్రై స్టేట్‌లో నేను ఐదు రోజులు ఖాళీగా ఉంటాననుకున్నారా?’ అంటూ కామెంట్‌ను జత చేసింది. టెస్టు సిరీస్‌తో పాటు టీ20 సిరీస్‌కు ఆతిథ్యమిస్తున్న గుజరాత్‌తో మద్యపానంపై పూర్తి నిషేధం ఉంది.

 

ఈ ఫన్నీ ట్వీట్‌పై పాజిటివ్‌గా స్పందించాడు కోచ్ రవిశాస్త్రి... ‘ఈ పరిహాసం నాకెంతో నచ్చింది. ఈ కష్ట సమయాల్లో కొందరు ముఖాల్లో అయినా నవ్వు తెప్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. రవిశాస్త్రి ఇచ్చిన ఈ రిప్లై, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios