వెస్టిండీస్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో హ్యాట్రిక్ వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ మరో రికార్డుపై కన్నేశాడు.. మరో వికెట్ సాధిస్తే వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా షమీ రికార్డును సమం చేస్తాడు.

మహ్మద్ షమీ 56 వన్డేల్లో 100 వికెట్లు తీయగా... కుల్‌దీప్ ఇప్పటి వరకు 55 వన్డేల్లో 99 వికెట్లు కూల్చాడు. ఆదివారం కటక్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న చివరి వన్డేలో కుల్‌దీప్ ఈ రికార్డును అందుకుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:హ్యాట్రిక్స్: ఆ రికార్డు కుల్దీప్ యాదవ్ సొంతం

అంతేకాకుండా మరో వికెట్ సాధిస్తే వన్డేల్లో 100 వికెట్ల క్లబ్‌లో చేరిన 22వ భారత బౌలర్‌గా, 8వ స్పిన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. వెస్టిండీస్ పై విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో అంతర్జాతీయ వన్డే మ్యాచులో భారత ఎడమ చేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో రెండు హ్యాట్రిక్స్ సాధించిన తొలి భారత బౌలర్ గా అతను రికార్డు సృష్టించాడు. 

పాతికేళ్ల వయస్సు గల కుల్దీప్ యాదవ్ విశాఖపట్నంలో వరుసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. షాయ్ హోప్ (78), జాసోన్ హోల్డర్ (11), అల్జర్రి జోసెఫ్ (0) వికెట్లను తీశాడు. వెస్టిండీస్ 38వ ఓవరులో అతను వరుసగా ఆ వికెట్లను పడగొట్టాడు.

కుల్దీప్ యాదవ్ 33వ ఓవరులో వేసిన నాలుగో బంతికి డీప్ మిడ్ వికెట్ స్థానంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకోవడం ద్వారా షాయ్ హోప్ పెవిలియన్ చేరుకున్నాడు.

Also Read:విశాఖలో సెంచరీ...రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డ్

ఆ తర్వాతి బంతికి రిషబ్ పంత్ జాసోన్ హోల్డర్ ను స్టంపవుట్ చేశాడు. ఓవరు చివరి బంతికి కేదార్ జాదవ్ సెకండ్ స్లిప్ లో క్యాచ్ పట్టడం ద్వారా జోసెఫ్ అవుటయ్యాడు. కోల్ కతాలో 2017లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచులో కుల్దీప్ యాదవ్ తొలి హ్యాట్రిక్ సాధించాడు.