హ్యాట్రిక్స్: ఆ రికార్డు కుల్దీప్ యాదవ్ సొంతం

వెస్టిండీస్ పై హ్యాట్రిక్ సాధించడం ద్వారా కుల్దీప్ యాదవ్ ఇండియా తరఫున రెండు హ్యాట్రిక్స్ సాధించిన బౌలర్ గా రికార్డులకు ఎక్కాడు. విశాఖలో బుధవారం జరిగిన వన్డేలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు.

Kuldeep Yadav becomes 1st Indian to take two hat-tricks in international cricket

విశాఖపట్నం: వెస్టిండీస్ పై విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో అంతర్జాతీయ వన్డే మ్యాచులో భారత ఎడమ చేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో రెండు హ్యాట్రిక్స్ సాధించిన తొలి భారత బౌలర్ గా అతను రికార్డు సృష్టించాడు. 

పాతికేళ్ల వయస్సు గల కుల్దీప్ యాదవ్ విశాఖపట్నంలో వరుసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. షాయ్ హోప్ (78), జాసోన్ హోల్డర్ (11), అల్జర్రి జోసెఫ్ (0) వికెట్లను తీశాడు. వెస్టిండీస్ 38వ ఓవరులో అతను వరుసగా ఆ వికెట్లను పడగొట్టాడు.

Also Read: విశాఖలో సెంచరీ...రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డ్

కుల్దీప్ యాదవ్ 33వ ఓవరులో వేసిన నాలుగో బంతికి డీప్ మిడ్ వికెట్ స్థానంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకోవడం ద్వారా షాయ్ హోప్ పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాతి బంతికి రిషబ్ పంత్ జాసోన్ హోల్డర్ ను స్టంపవుట్ చేశాడు. ఓవరు చివరి బంతికి కేదార్ జాదవ్ సెకండ్ స్లిప్ లో క్యాచ్ పట్టడం ద్వారా జోసెఫ్ అవుటయ్యాడు. 

కోల్ కతాలో 2017లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచులో కుల్దీప్ యాదవ్ తొలి హ్యాట్రిక్ సాధించాడు. కాగా, వెస్టిండీస్ పై విశాఖలో జరిగిన రెండో వన్డే మ్యాచులో భారత్ 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ పై మూడోది అయిన చివరి వన్డే డిసెంబర్ 22వ తేదీన కటక్ లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. 

Also Read: 17 ఏళ్ల క్రితం రికార్డును బద్దలు కొట్టిన రోహిత్, రాహుల్ జోడీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios