టీమిండియా సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై అభిమానులు డైలమాలో వున్నారు. ప్రస్తుతం  ధోని వెస్టిండిస్ పర్యటనను కాదని రెండు నెలల పాటు భారత ఆర్మీలో పనిచేయడానికి సిద్దమయ్యాడు. ప్రపంచ కప్ తర్వాత ధోని క్రికెట్ కు గుడ్ బై చెబుతాడని ప్రచారం  జరగ్గా...అందుకు బిన్నంగా ధోని తాత్కాలికంగా  జట్టు నుండి తప్పకున్నాడు. దీంతో అతడి తన కెరీర్ గురించి ఏం ఆలోచిస్తున్నాడో ఎవరికీ  అర్థం కాకుండా పోయింది. కానీ ధోని విషయంలో తనకు ఓ స్పష్టత వుందంటూ టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 

''భారత జట్టులో ప్రస్తుతం ధోనియే అత్యుత్తమ ఆటగాడు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కెప్టెన్ కూల్ గానే కాకుండా బ్యాట్స్ మెన్, వికెట్  కీపర్, బెస్ట్ ఫినిషర్, హిట్టర్ గా అతడు తానేంటో నిరూపించుకున్నాడు. వికెట్ కీపర్ గా అయితే అతడి స్థానంలో మరో ఆటగాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. అయితే ఇప్పుడు టీమిండియాకు ఆ అవసరం వచ్చింది. 

ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు దూరమైనా పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి సత్తా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టీ20, వన్డే ఫార్మాట్ లో అతడే అత్యుత్తమ ఆటగాడు. వరల్డ్ సెమీ ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలో కూడా అతడు సాధించిన హాప్ సెంచరీనే అందుకు నిదర్శనం. అయితే ప్రస్తుతం ధోని రిటైర్మెంట్ పై అందరిలో ఓ  డైలమా కొనసాగుతోంది. కానీ నాకు మాత్రం ఈ  విషయంలో స్పష్టత వుంది.'' అని ఎమ్మెస్కే తెలిపాడు. 

ఇలా ధోని రిటైర్మెంట్ పై తనకు స్పష్టత వుందనప్పటికి అదేమిటో ఎమ్మెస్కే బయటపెట్టలేదు. అయితే అతడి మాటలను బట్టి చూస్తే ధోని మరికొంత కాలం పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అప్పటిదవరకు అతడి స్థానాన్ని భర్తీ చేయగల మరో కెట్ కీపర్ ను సెలెక్టర్లు ఎంపికచేసుకోవాలన్నమాట. అయితే అతడు రిటైరయ్యేదానిపై మాత్రం ఎమ్మెస్కే ప్రసాద్ బయటపెట్టలేదు. 

సంబంధిత  వార్తలు

ధోని రిటైర్మెంట్: సెలక్టర్లకు పూర్తి క్లారిటీ... అభిమానులకు మాత్రమే సస్పెన్స్

ధోని రిటైర్మెంట్ వాయిదా.... ఆ ప్రపంచ కప్ వరకు కొనసాగాలని కోహ్లీ కోరడంతోనే

అతనికి ఏం చేయాలో తెలుసు: ధోని రిటైర్మెంట్‌పై ఎమ్మెస్కే క్లారిటీ

రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన ధోని... స్వయంగా బిసిసిఐకి సమాచారం