వన్డే వరల్డ్ కప్... నాలుగు దశాబ్దాలకు మొదలయ్యింది. ఈ మధ్య  కాలంలో క్రికెట్ లో అడుగుపెట్టిన పొట్టి క్రికెట్(ట్వంటీ ట్వంటీ) కు కూడా ఐసిసి ప్రపంచ కప్ నిర్వహిస్తోంది. కానీ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్లో మాత్రం ప్రపంచ కప్ మాట అటుంచి ఇప్పటివరకు ఐసిసి ఒక్క అంతర్జాతీయ టోర్నీని నిర్వహించలేదు. అయితే టీ20ల రాకతో మరింత ఆదరణ కోల్పోతున్న టెస్ట్ క్రికెట్ ను బ్రతికించేందుకు ఐసిసి ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అదే టెస్ట్ చాంపియన్‌షిప్.

అంతర్జాతీయంగా ఐసిసి నుండి టెస్ట్ హోధాను పొందిన జట్లన్ని ఈ ఛాపింయన్ షిప్ లో పాల్గొననున్నాయి. దాదాపు రెండేళ్లపాటు వివిధ సందర్భాల్లో ఈ మ్యాచులను నిర్వహించి తొలిరెండు స్థానాల్లో నిలిచిన జట్లకు 2021 జూన్ లో ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే ఇలాంటి సుదీర్ఘమైన టోర్నీని నిర్వహించడాకి  ముందుకు వచ్చిన ఐసిసి ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీఅభినందించాడు.. అయితే ప్రస్తుత టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ప్రదర్శన, ఆటగాళ్ల ఫామ్ ను బట్టిచూస్తే  మొదటి ఐసిసి టెస్ట్ చాంపియన్ షిప్ కూడా భారత్ ను వరించేట్లు కనిపిస్తోందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

'' ఇలా సుదీర్ఘంగా జరిగే ఈ ఫార్మాట్ వల్ల టెస్ట్ క్రికెట్ కు ఎంతో మేలు జరగనుంది. టెస్ట్ క్రికెట్ ను మరింత ఆసక్తికరంగా మార్చిన ఈ చాంపియన్ షిప్ కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.  గతకొంత కాలంగా టీమిండియా టెస్ట్ ఫార్మాట్ లో అద్భుతంగా  ఆడుతుంది. ఇదే ప్రదర్శనను ఈ రెండేళ్ల పాటు కొనసాగిస్తే ఇంగ్లాండ్ వేదికన 2021లో జరిగే టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలా మొదటి టీ20 ప్రపంచ కప్ మాదిరిగా మొదటి టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని అందుకునే అవకాశాలు టీమిండియాకు పుష్కలంగా వున్నాయి.'' అని కోహ్లీ పేర్కొన్నాడు.       

2019-2021 జూన్ వరకు దాదాపు రెండు సంవత్సరాలపాటు ఈ మెగా టోర్నీ సాగనుంది. ఇందులో టెస్ట్ హోదా ఉన్న తొమ్మిది జెట్లు పాల్గొననున్నాయి (జింబాంబ్వే మినహాయిస్తే). ప్రతి దేశం తనకు నచ్చిన జట్లతో ఆరు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాల్సి వుంటుంది. ప్రతి సిరీస్ కి 120 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు.  ఒక వేళ ఏదైనా జట్టు రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడితే ఒక్కో మ్యాచ్ కు 60 పాయింట్లు, 3 మ్యాచ్ ల సిరీస్ ఆడితే ఒక్కో మ్యాచ్ కు 40 పాయింట్లు లభిస్తాయన్నమాట. చివరకు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు 2021లో ఇంగ్లాండ్ లో జరిగే ఫైనల్ లో తలపడతాయి. 

ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తలపడే యాషెస్ టెస్ట్ సిరీస్ తో ఈ గ్రాండ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇండియా విండీస్ టూర్ తో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ 6 ద్వైపాక్షిక సిరీస్ లలో 3 సిరీస్లను స్వదేశం లో ఆడాల్సి ఉండగా, 3 విదేశాలలో ఆడాలి అనే నిబంధనను ఐసిసి విధించింది.    

సంబంధిత వార్తలు 

టెస్ట్ క్రికెట్ కి వరల్డ్ కప్:పూర్వ వైభవం వచ్చేనా?