టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి ఆటగాడే కాదు మాటగాడు కూడా. క్రికెటర్ గా అతడేంత ఉన్నత స్థాయికి చేరుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇక వివిధ సందర్భాల్లో అద్భుత వాక్చాతుర్యంతో కోహ్లీ అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా అతడు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకునేలా పోస్ట్ లు పెడుతూ అందులోనూ ఆరితేరుతున్నాడు.ముఖ్యంగా గతకొంతకాలంగా అతడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటూ క్రికెట్ కు సంబంధించిన అప్‌డేట్స్ నే కాదు తన భావాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. 

గతంలో ఓసారి కోహ్లీ తన చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చిన్ననాటి ఫోటోతో ప్రస్తుతం ట్రెండింగ్ గా తయారైన ఫోటోను జతచేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ  ఫోటోకు ఓ  క్యాప్షన్ కూడా జతచేశాడు. ''16 ఏళ్ల  కుర్రాడిగా నేను ఇలా వున్నా. ఇప్పుడేమో ఇలా వున్నా'' అని కోహ్లీ పేర్కొన్నాడు. 

తమ అభిమాన ఆటగాడు కుర్రాడుగా వున్నప్పటి ఫోటో అభిమానులకు తెగ నచ్చినట్లుంది. లేత వయసులో బాగా అమాయకంగా వున్న కోహ్లీ, ఇప్పుడు ఫ్యాషన్ కు  మారుపేరులా మారిన కోహ్లీ ఒకరేనా అన్న అనుమానాన్ని అభిమానులు కామెంట్స్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు. కోహ్లీ భావన  కూడా అలాగే వున్నట్లుంది. ఒకప్పుడు ఎలా  వున్నాను...ఇప్పుడెలా వున్నానో అభిమానులకు తెలిచయజేయడానికే కోహ్లీ ఈ ట్వీట్ చేసివుంటాడు.

టీమిండియా ఆటగాళ్ళందరికంటే కోహ్లీ సోషల్ మీడియాలో ఎక్కువ  యాక్టివ్ గా వుంటున్నాడు. అతడికి తోడుగా భార్య అనుష్క శర్మ  కూడా నిత్యం కోహ్లీకి సంబంధించిన ఫోటోలను వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటుంది. ఇలా భారత క్రికెటర్లందరిలోకెల్ల అత్యధిక ఫాలోవర్స్ ను కలిగిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.