మొదటి ఓవర్‌లో 17 పరుగులు సమర్పించిన భువనేశ్వర్ కుమార్... రాహుల్ త్రిపాఠి స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేరిన శుబ్‌మన్ గిల్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్న భారత స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కి ఓ అరుదైన రికార్డు ఉంది. 2015 అక్టోబర్‌లో వన్డేల్లో నో బాల్ వేసిన భువనేశ్వర్ కుమార్, ఆరేళ్ల పాటు గీత దాటలేదు. ఆరేళ్ల పాటు నో బాల్ వేయకుండా అదరగొట్టిన భువీ, ఐపీఎల్ 2022 సీజన్‌లో మాత్రం నో బాల్స్‌తో పాటు వైడ్ బాల్స్‌తో ఎక్స్‌ట్రాల రూపంలో అదనపు పరుగులు సమర్పిస్తున్నాడు...
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో నో బాల్స్ కారణంగా సెంచరీ మ్యాన్ జోస్ బట్లర్‌ను అవుట్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న భువనేశ్వర్ కుమార్, గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో వైడ్ల రూపంలో ఏకంగా 11 పరుగులు సమర్పించాడు.
భువీ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికి మాథ్యూ వేడ్ ఫోర్ బాదగా, ఆ తర్వాతి బంతికి వైడ్ల రూపంలో 5 పరుగులు వచ్చాయి. రెండో బంతికి లెగ్ బైస్ రూపంలో మరో పరుగు కాగా మూడో బంతి వైడ్‌గా వెళ్లింది. ఐదో బంతికి లైన్ మిస్ అయిన భువీ, 5 వైడ్లు సమర్పించాడు...
మొత్తంగా తొలి ఓవర్‌లో 9 బంతులు వేసిన భువనేశ్వర్ కుమార్, ఎక్స్‌ట్రాల రూపంలో 12 పరుగులు ఇచ్చాడు. ఇందులో వైడ్ల రూపంలో వచ్చింది 11 పరుగులు... ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన జట్టుగా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి ఓవర్‌లో 14 పరుగులు ఇవ్వగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ దాన్ని అధిగమించింది...
అయితే రెండో ఓవర్‌లో ఇన్ ఫామ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ని పెవిలియన్ చేర్చాడు భువనేశ్వర్ కుమార్. భువీ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి అవుట్ అయ్యాడు భువీ. గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు రాహుల్ త్రిపాఠి. త్రిపాఠి పట్టిన క్యాచ్‌కి బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆశ్చర్యపోవడం విశేషం... గత రెండు మ్యాచుల్లో 84, 96 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో సింగిల్ డిజిట్ (7 పరగులు) స్కోరుకే పెవిలియన్ చేరాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్, టి నటరాజన్ బౌలింగ్‌లో కేన్ విలియంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 47 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది గుజరాత్ టైటాన్స్...
గత రెండు మ్యాచుల్లో 150+ వేగంతో బంతులు విసిరినా వికెట్ తీయలేకపోయిన ఉమ్రాన్ మాలిక్, నేటి మ్యాచ్‌లో తన మొదటి ఓవర్‌లోనే వికెట్ రాబట్టగలిగాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 8 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్. వరుస వికెట్లు పడుతున్నా ఎక్కడా రన్‌రేట్ తగ్గకుండా పరుగులు చేస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నారు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు..
