Asianet News TeluguAsianet News Telugu

మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది: ధోనీ రిటైర్మెంట్‌పై సీఎం స్పందన

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడాన్ని సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. అయినప్పటికీ తేరుకుని సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. 

tamilnadu cm palaniswami tweet on ms dhoni retirement
Author
Chennai, First Published Aug 16, 2020, 3:25 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడాన్ని సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. అయినప్పటికీ తేరుకుని సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. తాజాగా తమిళనాడు సీఎం పళని స్వామి స్పందించారు. ధోనీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.

 

‘‘ 331 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించటంతో పాటు కెప్టెన్ కూల్‌గా భారతదేశానికి మూడు ఛాంపియన్‌షిప్‌లు గెలిపించినందుకు ధోనీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అతని విజయాలు, కీర్తీ ప్రతీ భారతీయుడికి చిరస్మరణీయమని’’ పళని స్వామి ట్వీట్‌లో పేర్కొన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించారు. ‘‘ మీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు.. మీరు వదిలివేస్తున్న వారసత్వం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాబోయే తరాల క్రికెట్ ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తూ ఉంటుంది. మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios