ఇస్లామాబాద్: తన పట్ల సహచర క్రికెట్ జట్టు సభ్యులు చూపిన వివక్షను వెల్లడించిన షోయబ్ అక్తర్ కు స్పిన్నర్ డానిష్ కనేరియా ధన్యవాదాలు తెలిపాడు. అదే సమయంలో ఈ వివాదం నుంచి తనను బయటపడేయడానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు, పాకిస్తాన్ క్రికెట్ పాలకులు సహకరించాలని ఆయన కోరాడు. 

ఫిక్సింగ్ ఆరోపణలపై 39 ఏళ్ల కనేరియా 2012లో క్రికెట్ నుంచి నిషేధానికి గురయ్యాడు. ఈ వివాదం నుంచి తనను బయటపడేయడానికి ముందుకు రావాలని చాలా మందిని తాను కోరినట్లు తెలిపాడు. 

కనేరియా పూర్తి పేరు దినేష్ ప్రభ శంకర్ కనేరియా. పాకిస్తాన్ జాతీయ జట్టుకు అతను 2000, 2010 మధ్య కాలంలో ప్రాతినిధ్యం వహించాడు. కుడిచేతి వాటం లెగ్ స్పిన్నర్ అయిన కనేరియా గూగ్లీలు వేయడం దిట్ట. అత్యధిక వికెట్లు తీసుకున్న పాకిస్తాన్ బౌలర్లలో అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. 

Also Read: హిందువు కాబట్టే: కనేరియాపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

కనేరియా కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నవారు సామాన్యులు కారు. వారు వసీం అక్రమ్, వకార్ యానిస్, ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ జట్టు. పాకిస్తాన్ జట్టులో చోటు సంపాదించుకున్న రెండో హిందువు కనేరియా. ఆయన కన్నా ముందు అనిల్ దల్ పత్ పాక్ జాతీయ జట్టుకు ఆడాడు. మొత్తంగా పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఏడో ముస్లిమేతర క్రికెటర్. 

కనేరియా 61 టెస్టు మ్యాచులు ఆడి 262 వికెట్లు తీసుకున్నాడు. పాకిస్తాన్ తరఫున అతను కేవలం 18 వన్డేలు మాత్రమే ఆడాడు. వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఒక్క ఇన్నింగ్సులో 77 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసుకోవడం అతని అత్యుత్తమ ప్రదర్శన. ఓ మ్యాచులో 94 పరుగులు ఇచ్చి 12 వికెట్లు తీసుకున్నాడు. ఇది ఓ మ్యాచులో అతని అత్యుత్తమ ప్రదర్శన. ఈ రెండు ప్రదర్శనలు కూడా అతను బంగ్లాదేశ్ మీద ఇచ్చినవే. 

Also Read: షోయబ్ చెప్పింది ముమ్మాటికీ నిజం... హిందూ వివక్ష పై కనేరియా స్పందన

టెస్టు క్రికెట్ లో 15 సార్లు ఐదు వికెట్లు తీసుకున్న ఘనత సాధించాడు.  రెండు సార్లు పది, అంతకు మించి వికెట్లు తీసుకున్నాడు. ఒక్కటి బంగ్లాదేశ్ పై కాగా, రెండోది శ్రీలంకపై. అతను పాకిస్తాన్ తరఫున టీ20 మ్యాచులు ఆడలేదు. 

తనపై విధించిన నిషేధంపై కనేరియా సవాల్ చేశాడు గానీ ఫలితం దక్కలేదు. కనేరియా కరాచీలో 1980 డిసెంబర్ 16వ తేదీన జన్నించాడు. తల్లిదండ్రులు బబితాబెన్, లాల్ జీ భాయ్ కనేరియా. ప్రాథమికంగా వారు గుజరాతీలు. కనేరియా ముద్దు పేర్లు డానీ, నానీ డానీ. అతను కరాచీలోని ప్రభత్ ఇస్లామియా కాలేజీలో చదివాడు. కనేరియా ధర్మిత కనేరియాను వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు ఓ కూతురు ఉన్నారు. కుమారుడిని పేరు డానిష్ కనేరియా జూనియర్. కూతురి పేరు పారిసా కనేరియా.

శతాబ్దం క్రితం కనేరియా కుటుంబం భారతదేశంలోని సూరత్ నుంచి కరాచీకి వలస వెళ్లింది. 2009లో దేశీవాళీ సీజన్ లో అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణపై కనేరియా 2010 మేలో అరెస్టయ్యాడు. దర్యాప్తును ముగించామని, ఆరోపణల్లో నిజం లేదని తేలిందని పోలీసులు కనేరియాకు చెప్పారు.