Pakistan: రోజూవారీ పరీక్షలలో భాగంగా క్రికెటర్లకు పరీక్షలు నిర్వహించగా.. అందులో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా ధ్రువీకరించింది.

టీ20 ప్రపంచకప్ లో అదరగొడుతున్న పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ జట్టు అభిమానులకు దుర్వార్త. ఆ జట్టుకు చెందిన ముగ్గరు క్రికెటర్లు కరోనా (Corona) భారీన పడ్డారు. రోజూవారీ పరీక్షలలో భాగంగా క్రికెటర్లకు పరీక్షలు నిర్వహించగా.. అందులో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ-PCB) కూడా ధ్రువీకరించింది. దీంతో పాకిస్థాన్ అభిమానులకు షాక్ తగిలినట్టైంది. 

వివరాల్లోకెళ్తే.. పాకిస్థాన్ మహిళా జట్టు (Pakistan Womens cricket team) లోని ముగ్గురు మహిళా క్రికెటర్లకు కరోనా నిర్ధారణ అయిందని పీసీబీ తెలిపింది. గురువారం అందుకు సంబంధించి పీసీబీ అధికారిక ప్రకటన కూడా చేసింది. అయితే కరోనా భారీన పడ్డ క్రికెటర్ల పేర్లను మాత్రం పీసీబీ వెల్లడించలేదు. అయితే వైరస్ సోకినవాళ్లు మాత్రం పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని పీసీబీ ఆదేశించింది. వారితో పాటు మిగతా క్రికెటర్లు వేరుగా ఉండాలని, వాళ్లు రోజూవారీ కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. నవంబర్ 2 దాకా అందరూ ఐసోలేషన్ లోనేఉండాలని సూచించింది. 

పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు.. త్వరలోనే వెస్టిండీస్ (west Indies) తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. స్వదేశంలో జరుగనున్న వన్డే సిరీస్ కోసం ఏర్పాటుచేసిన సన్నాహక శిబిరంలో జట్టు సభ్యులకు రొటీన్ చెకప్ చేయగా.. పరీక్షల్లో ఈ విషయం వెలుగుచూసింది. 

Also Read:T20 Worldcup: పాకిస్థాన్ కోచ్ గా టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన మాజీ కోచ్.. పరిశీలనలో మరో ఇద్దరి పేర్లు..?

వచ్చే నెల 8, 11, 14 తేదీలలో పాకిస్థాన్ జట్టు.. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పాక్ జట్టులో కరోనా కలకలం రేగడంతో ఈ సిరీస్ జరుగుతుందా..? లేదా..? అన్నదానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

Also Read:T20 Worldcup: ‘క్షమించండి.. మోకాళ్లపై నిలబడతా.. ఇకపై అలా చేయను..’ ఎట్టకేలకు దిగొచ్చిన క్వింటన్ డికాక్

ఇదిలాఉండగా.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) లో అద్భుత ప్రదర్శనలతో పాకిస్థాన్ పురుషుల జట్టు అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ అదిరిపోయే ఆటతీరుతో ఆ జట్టు గ్రూప్-2లో టాపర్ గా ఉంది. చిరకాల ప్రత్యర్థి భారత్ (India) తో పాటు కొత్త ప్రత్యర్థి న్యూజీలాండ్ (Newzealand) పై కూడా పాక్ ప్రతీకారం తీర్చుకుంది. రేపు ఆఫ్ఘనిస్థాన్ తో తలపడనున్నది.