Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: ‘క్షమించండి.. మోకాళ్లపై నిలబడతా.. ఇకపై అలా చేయను..’ ఎట్టకేలకు దిగొచ్చిన క్వింటన్ డికాక్

Quinton De kock: ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న డికాక్.. ఎట్టకేలకు దిగొచ్చాడు. తాను క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ బహిరంగ లేఖను విడుదల చేశాడు.

ICC T20 Worldcup2021: South africa player quinton de kock issues apology announcing availability for remaining games
Author
Hyderabad, First Published Oct 28, 2021, 2:07 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దక్షిణాఫ్రికా (South Africa) వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ (Quinton de kock) దిగొచ్చాడు.  అనవసర వివాదాన్ని నెత్తినెత్తుకున్న ఈ ఆటగాడు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడనని తెలిపాడు.  ఇక నుంచి విధిగా మోకాళ్ల మీద నిల్చుంటునానని హామీ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా ఆడబోయే తదుపరి మ్యాచ్ లకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. 

అసలు వివాదం..

గతేడాది అమెరికాతో పాటు యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (Block Lives Matter) ఉద్యమానికి సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రీడాకారులు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) వంటి మెగా ఈవెంట్ లో కూడా దానిని అమలు చేసి ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని ఐసీసీ (ICC) భావించింది. ఇందులో భాగంగా.. ఆట ప్రారంభానికి ముందు ఆటగాళ్లంతా మోకాళ్లపై నిల్చుని సంఘీభావం తెలపాలి. ప్రపంచకప్ ప్రారంభమైనప్పట్నుంచి పలువురు ఆటగాళ్లు స్వచ్ఛందంగానే దీనికి మద్దతు తెలుపుతున్నారు. 

ఇక ఈ టోర్నీలో  ఆసీస్ తో తొలి మ్యాచ్ ఆడిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు.. ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు.  అయితే అందరూ ఒకే రీతిన కాకుండా కొందరు కూర్చుని.. మరికొందరు నిల్చుని.. ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో వెస్టిండీస్ తో మ్యాచ్ ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా బోర్డు (Cricket Southafrica) కీలక ఆదేశాలు జారీచేసింది. ఆటగాళ్లంతా మైదానంలో మెకాళ్ల మీద నిల్చోవలసిందేనని హుకుం జారీ చేసింది. ఇదే డికాక్ కు కోపం తెప్పించింది.  

ICC T20 Worldcup2021: South africa player quinton de kock issues apology announcing availability for remaining games

ఈ నిర్బంధ ఆదేశాలేంటని  ప్రశ్నించిన అతడు.. ఆ మ్యాచ్ కూడా ఆడలేదు. సంఘీబావం తెలుపుతాం గానీ నిర్బంధ మద్ధతుపై నిరసన వ్యక్తం చేశాడు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ఆ జట్టు కెప్టెన్ బవుమా (Bavuma).. డికాక్ కు మద్దతుగా నిలిచాడు. బోర్డు  ఏకపక్ష నిర్ణయంపై ప్రశ్నలు సంధించాడు. బవుమా కూడా నల్లజాతీయుడే కావడం గమనార్హం. దక్షిణాఫ్రికాలో నల్లజాతీయుడు కెప్టెన్ కావడం ఇదే తొలిసారి.  

ఈ వివాదం చిలికి చిలికి గాలి వాన అయింది. డికాక్ అనంతరం పలువురు శ్వేతజాతి క్రికెటర్లు కూడా.. ‘మేం అలా చేయలేం..’ అని చెప్పకనే చెప్పారు. దీంతో  బ్లాక్ లైవ్స్  మ్యాటర్ ఉద్యమ స్ఫూర్తికే భంగం వాటిల్లుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. 

క్షమాపణలు చెప్పిన డికాక్.. 

ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న డికాక్.. ఎట్టకేలకు దిగొచ్చాడు. తాను క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ బహిరంగ లేఖను విడుదల చేశాడు. ఇకనుంచి ఇలా ప్రవర్తించబోనని హామీ ఇచ్చాడు. 

లేఖలో డికాక్.. ‘నేను దీనిని ఎప్పుడూ సమస్యగా మార్చాలని అనుకోలేదు. జాత్యాహంకారినికి (Racism) వ్యతిరేకంగా నిలబడటం ప్రాముఖ్యతను నేను అర్థం చేసుకున్నాను.  అంతేగాక క్రీడాకారుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంలో ఉన్న బాధ్యతనూ తెలుసుకున్నాను. ఒకవేళ నేను మోకాళ్ల మీద కూర్చోవడం ద్వారా అది ఇతరులకు రేసిజం గురించి అవగాహన కల్పిస్తుందనుకుంటే ఆ బాధ్యతను నేను సంతోషంగా స్వీకరిస్తాను’ అని  పేర్కొన్నాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Quinton De Kock (@qdk_12)

అంతేగాక.. ‘వెస్టిండీస్ ఆటగాళ్లను అవమానించడం నా ఉద్దేశం కాదు. ఇది మంగళవారం ఉదయం జరగడం వల్ల అలా అనుకుని ఉండొచ్చు. ఈ విషయాలపై నేను చాలా హర్ట్ అయ్యాను. దీనిపై నేను చింతిస్తున్నాను’ అని తెలిపాడు.

‘చాలా మందికి తెలియని విషయమేమిటంటే నేను మిశ్రమ జాతి కుటుంబం నుంచి వచ్చాను. నా పినతల్లి నల్లజాతీయురాలు. నా సోదరీమణుల రంగు కూడా నలుపే. అందరికీ హక్కులు, సమానత్వం చాలా ముఖ్యం. మనందరికీ హక్కులున్నాయని, అవి ముఖ్యమైనవని అర్థం చేసుకుంటూనే నేను పెరిగాను’ అంటూ తన లేఖలో డికాక్ రాసుకొచ్చాడు. 

వివాదానికి తెరదించిన డికాక్.. తాను తర్వాతి మ్యాచ్ లకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. దీంతో ఈ వివాదానికి ఇప్పటికైనా తెరపడినట్టే అని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు భావిస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios