Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup 2021 విజేత ఆస్ట్రేలియా... ఫైనల్ మ్యాచ్‌లో తేలిపోయిన కివీస్ బౌలర్లు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ విజేతగా ఆస్ట్రేలియా... ఆసీస్ ఖాతాలో మొదటి టీ20 ప్రపంచకప్... తొలిసారి ఫైనల్ చేరినా టైటిల్ నెగ్గలేకపోయిన కివీస్...

T20 Worldcup 2021  Winner Australia, Aussies beats New Zealand in T20WC Final match
Author
India, First Published Nov 14, 2021, 10:54 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021   ఫైనల్ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన జట్టునే విజయం వరించింది. కేన్ మామ సునామీ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ పెట్టినా, దాన్ని కాపాడుకోవడంతో న్యూజిలాండ్ బౌలింగ్ యూనిట్ విఫలమైంది. దీంతో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ టైటిల్ విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకి ఇది మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ కాగా, ఓవరాల్‌గా ఆరో ప్రపంచకప్ (వన్డేల్లో ఐదుసార్లు వరల్డ్‌కప్ గెలిచింది ఆసీస్). తొలిసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ చేరిన న్యూజిలాండ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

173 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్‌కి శుభారంభం దక్కలేదు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో డార్ల్ మిచెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ కలిసి రెండో వికెట్‌కి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే కివీస్‌కి జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. మరో ఎండ్‌లో సిక్సర్‌తో ఖాతా తెరిచిన మిచెల్ మార్షన్ బౌండరీల మోత మోగించాడు. 

Read: టీమిండియాతో ఆడితే అంతే... కివీస్‌ను భయపెడుతున్న సెంటిమెంట్, భారత జట్టుతో తలబడిన ఏ టీమ్...

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేన్ విలియంసన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేస్తే, రెండో ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ దాన్ని బ్రేక్ చేసేశాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న మిచెల్ మార్ష్, 77 పరుగులు చేయగా., మ్యాక్స్‌వెల్ 28 పరుగులు చేశాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో మార్ష్ 77 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్ 18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఫై 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు మిచెల్. మరో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 35 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 

ఆ తర్వాత కేన్ విలియంసన్, గ్లెన్ ఫిలిప్ కలిసి మూడో వికెట్‌కి 37 బంతుల్లో 68 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 21 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కేన్ విలియంసన్ ఇచ్చిన క్యాచ్‌ను న్యూజిలాండ్ ఫీల్డర్ జోష్ హజల్‌వుడ్ జారవిడిచాడు. 

Read also: మూడు ఫార్మాట్స్, మూడు ఫైనల్స్, అన్నింట్లోనూ అతనే... కేన్ మామ కాస్త నీ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పు...


మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన కేన్ విలియంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.   48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేసిన కేన్ విలియంసన్, హజల్ వుడ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా మార్లన్ శామ్యూల్స్ 66 బంతుల్లో 85 పరుగుల రికార్డును అధిగమించిన కేన్ విలియంసన్స్, 48 బంతుల్లోనే 85 పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు. 

ఓవరాల్‌గా ఐసీసీ వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో అత్యధిక స్కోరు చేసిన నాలుగో కెప్టెన్‌గా నిలిచాడు కేన్ విలియంసన్. 2003 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ 140 పరుగులు చేసి టాప్‌లో ఉండగా, క్లెయివ్ లార్డ్ 102 పరుగులు 1975 వరల్డ్‌కప్‌లో, ఎమ్మెస్ ధోనీ 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో 91 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

ఓవరాల్‌గా కెప్టెన్‌గా మూడో ఐసీసీ ఫైనల్ ఆడుతున్న కేన్ విలియంసన్, ఫైనల్స్‌లో 216 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు. రికీ పాంటింగ్ ఫైనల్స్‌లో 178, సౌరవ్ గంగూలీ 141 పరుగులతో టాప్ 3లో ఉన్నారు. జోష్ హజల్‌వుడ్ 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. టీ20 వరల్డ్‌కప్ 2007 ఫైనల్ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన ఇర్ఫాన్ పఠాన్ కూడా బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి 16 పరుగులే ఇవ్వడం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios