Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup 2021: ఆఖరి మ్యాచ్‌లో మారని విండీస్ బ్యాటింగ్... ఆస్ట్రేలియా ముందు...

T20 Worldcup 2021: 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసిన వెస్టిండీస్... నాలుగు వికెట్లు తీసిన జోష్ హజల్‌వుడ్..

T20 Worldcup 2021: West Indies failed to score huge total against Australia in their last match
Author
India, First Published Nov 6, 2021, 5:20 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగి, ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, ఆఖరి మ్యాచ్‌లో పెద్దగా మెరుపులు చూపించలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది...

మొదటి ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే రాగా, రెండో ఓవర్‌లో లూయిస్ వరుసగా మూడు ఫోర్లు, క్రిస్ గేల్ ఓ సిక్సర్ బాదడడంతో 20 పరుగులు వచ్చాయి. అయితే ప్యాట్ కమ్మిన్స్ వేసిన మూడో ఓవర్‌లో వెస్టిండీస్‌కి తొలి దెబ్బ తగిలింది. 9 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేసిన క్రిస్ గేల్, కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

వస్తూనే ఫోర్ బాదిన నికోలస్ పూరన్, హజల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో బంతికే రోస్టన్ ఛేజ్‌ను కూడా హజల్‌వుడ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఒకానొక దశలో 30/0 స్కోరుతో ఉన్న వెస్టిండీస్, 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

Read: ఒకే రకమైన పొజిషన్‌లో టీమిండియా, విండీస్‌... టీ20ల్లో వెస్టిండీస్ పతనానికి కారణమేంటి...

26 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసిన ఓపెనర్ ఇవిన్ లూయిస్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 28 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసిన హెట్మయర్ కూడా జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్ మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించి, ఆఖరి మ్యాచ్ ఆడుతున్న ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 12 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసి జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... 31 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన పోలార్డ్‌ను మిచెల్ స్టార్క్ అవుట్ చేయగా ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదిన ఆండ్రే రస్సెల్, విండీస్ స్కోరును 150+ మార్కు దాటించాడు. 

మొదటి ఓవర్‌లో 20 పరుగులు సమర్పించిన జోష్ హజల్‌వుడ్, ఆ తర్వాత మూడు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం విశేషం. వన్డే వరల్డ్‌ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల్లో నాలుగు, అంతకంటే ఎక్కువ వికెట్లుత తీసిన జోష్ హజల్‌వుడ్, టీ20 వరల్డ్‌కప్‌ లోనూ ఈ ఫీట్ రిపీట్ చేశాడు. మూడు ఐసీసీ టోర్నీల్లోనూ నాలుగేసి వికెట్లు తీసిన మొట్టమొదటి ఆస్ట్రేలియా బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు హజల్‌వుడ్. 

ఈ మ్యాచ్‌లో ఓ వికెట్ తీసిన ఆడమ్ జంపా, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో 11 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో మరో మూడు వికెట్లు తీస్తే, ఒకే టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్‌గా నిలుస్తాడు జంపా. 

Read also: రోహిత్ శర్మ కాదు, అతనికే టీమిండియా టీ20 కెప్టెన్సీ... ఏ మాత్రం కెప్టెన్సీ స్కిల్స్‌ లేని వ్యక్తికి...

Follow Us:
Download App:
  • android
  • ios