Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup 2021: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... నమీబియాతో ఆఖరి ఆటలో...

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ... వరుణ్ చక్రవర్తి స్థానంలో రాహుల్ చాహార్...

T20 Worldcup 2021:  Virat Kohli won the toss and elected field first against Namibia
Author
India, First Published Nov 8, 2021, 7:08 PM IST

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలోనమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నమీబియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న భారత జట్టు, సూపర్ 12 రౌండ్‌లో ఆఖరి మ్యాచ్ ఇదే...

టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్. అంతేకాకుండా టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి 50వ మ్యాచ్ కావడం విశేషం. అలాగే టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత రేపు (నవంబర్ 9న) స్వదేశానికి తిరిగి రానుంది భారత జట్టు.

భారత జట్టులోని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి ప్లేయర్లు, దాదాపు ఆరు నెలల తర్వాత స్వదేశానికి రానున్నారు. ఐపీఎల్ ఫస్టాఫ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన భారత జట్టు, అక్కడ ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌తో పాటు ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడింది. ఆ తర్వాత ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ కోసం యూఏఈ వెళ్లింది భారత జట్టు... 

Read also: విరాట్, రోహిత్‌తో పాటు వాళ్లందరికీ రెస్ట్... న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఏకంగా ఏడుగురు ప్లేయర్లకు...

అక్కడే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీని ముగించుకుని స్వదేశానికి తిరిగి రానుంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆడిన మొదటి మూడు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రాహుల్ చాహార్‌కి తుది జట్టులో చోటు దక్కింది. రాహుల్ చాహార్‌కి ఇది మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కానుంది. 

పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో నమీబియా ప్లేయర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బ్యాట్స్‌మెన్‌కి చెమటలు పట్టించారు. అయితే డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించడంతో విజయం సాధించలేకపోయింది నమీబియా...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ఉంటే భారత బ్యాట్స్‌మెన్ మెరుపులు చూసేందుకు అవకాశం ఉంటుందని భావించారు క్రికెట్ ఫ్యాన్స్. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయిన భారత జట్టు, ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో అయినా మెరుపులు మెరిపించి, భారీ స్కోరు చేస్తే... ఆ ఆనందం అయినా మిగులుతుందని ఆశించారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా మొదట బౌలింగ్ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. 

భారత జట్టు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, రాహుల్ చాహార్

నమీబియా జట్టు: స్టీఫెన్ బార్డ్, మైకెల్ వాన్ లింగ్టెన్, క్రెగ్ విలియమ్స్, గ్రెహార్డ్ ఎరాస్మస్, జేన్ గ్రీన్, డేవిడ్ వీస్, జాన్ ఫ్రైలింక్, జేజే స్మిత్, జాన్ నికోల్ లోఫ్టీ, రూబెన్ ట్రెంపెల్‌మాన్, బెనార్డ్ స్కోజ్

Read this: అట్టర్ ఫ్లాప్‌ దిశగా టీ20 వరల్డ్‌ కప్ టోర్నీ... రేటింగ్స్‌ను దెబ్బతీసిన టీమిండియా పర్ఫామెన్స్...

Follow Us:
Download App:
  • android
  • ios