Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup 2021: దంచికొట్టిన భారత బ్యాట్స్‌మెన్... దుమ్మురేపిన టీమిండియా...

T20 Worldcup 2021:  6.3 ఓవర్లలోనే మ్యాచ్ ముగించిన టీమిండియా... ఆఫ్ఘాన్‌ని అధిగమించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి... 

T20 Worldcup 2021: Team India beats Scotland, rohit Sharma and KL Rahul
Author
India, First Published Nov 5, 2021, 9:48 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీ20 వరల్డ్‌కప్‌ 2021టోర్నీలో అసలైన దీపావళి పండగను చూపించారు భారత ప్లేయర్లు. వీరబాదుడు, ఊచకోత, సిక్సర్ల మోత, బౌండరీల వర్షం... అనే పర్యాల పదాలకు అర్థం చెప్పేలా స్కాట్లాండ్ విధించిన 86 పరుగుల లక్ష్యాన్ని 6.3 ఓవర్లలోనే ఛేదించింది భారత జట్టు. తొలి ఓవర్‌లో రోహిత్ శర్మ ఒక ఫోర్ బాదడంతో 8 పరుగులు మాత్రమే వచ్చాయి.

అయితే  రెండో ఓవర్‌లో మూడు ఫోర్లతో 15 పరుగులు రాబట్టాడు కెఎల్ రాహుల్. ఆ తర్వాత మూడో ఓవర్‌లో కెఎల్ రాహుల్ ఓ ఫోర్, సిక్సర్ బాదగా, రోహిత్ ఓ ఫోర్ కొట్టి 16 పరుగులు రాబట్టారు.
నాలుగో ఓవర్‌లో ఓ సిక్సర్, రెండు ఫోర్లతో 14 పరుగులు రాబట్టాడు రోహిత్ శర్మ. దీంతో 4 ఓవర్లలోనే 53 పరుగులు చేసింది టీమిండియా. 

ఐదో ఓవర్‌లో 17 పరుగులు రాబట్టారు భారత ఓపెనర్లు. 16 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన రోహిత్ శర్మ, బ్రాడ్లీ వీల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రోహిత్ అవుటైనా ఆరో ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్, మూడో బంతికి సిక్సర్ బాదిన కెఎల్ రాహుల్ 18 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్. 

సూర్యకుమార్ యాదవ్ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు సూర్యకుమార్ యాదవ్... 81 బంతులు ఉండగానే మ్యాచ్‌ని ముగించి, టీ20ల్లో బంతుల పరంగా అతిపెద్ద విజయాన్ని అందుకుంది భారత జట్టు. రవీంద్ర జడేజాకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కగా, ఈ విజయంతో భారత రన్‌ రేట్, ఆఫ్ఘాన్ కంటే మెరుగవ్వడంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. 

Read: ఒకే రకమైన పొజిషన్‌లో టీమిండియా, విండీస్‌... టీ20ల్లో వెస్టిండీస్ పతనానికి కారణమేంటి...

అంతకుముందు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇప్పటిదాకా అద్భుతాలు చేయలేకపోయిన భారత బౌలర్లు, పసికూన స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయానికి విలువ నిస్తూ, భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. దీంతో స్కాట్లాండ్ ఓవర్లలో పరుగులకు ఆలౌట్ అయ్యింది.

కెప్టెన్ కేల్ కోట్జర్‌ను బుమ్రా బౌల్డ్ చేయడంతో 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది స్కాట్లాండ్. అయితే బుమ్రా వేసిన మొదటి ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాదిన స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సీ, రవిచంద్రన్ అశ్విన్ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసిన జార్జ్ మున్సేని షమీ అవుట్ చేశాడు. షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన మున్సే, హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Read also: రోహిత్ శర్మ కాదు, అతనికే టీమిండియా టీ20 కెప్టెన్సీ... ఏ మాత్రం కెప్టెన్సీ స్కిల్స్‌ లేని వ్యక్తికి...

ఆ తర్వాత రవీంద్ర జడేజా బంతితో మ్యాజిక్ చేశాడు. రిచీ బెర్టింటన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రవీంద్ర జడేజా, అదే ఓవర్‌లో వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్‌ను కూడా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేర్చి స్కాట్లాండ్‌ను దెబ్బ తీశాడు. క్రిస్ గ్రీవ్స్‌ని రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేయగా, 28 బంతుల్లో 16 పరుగులు చేసిన కలమ్ మెక్‌లార్డ్‌ను మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికి సఫ్యాన్ షరీఫ్ రనౌట్ అయ్యాడు.

షమీ ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేసినా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే సఫ్యాన్‌ క్రీజు దాటి రావడం గమనించిన ఇషాన్ కిషన్, పరుగెత్తుకుంటూ వెళ్లి రనౌట్ చేశాడు. ఆ తర్వాతి బంతికి అల్స్‌దర్ ఎవన్స్‌ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 13 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన మాథ్యూ వాట్‌ను బుమ్రా బౌల్డ్ చేయడంతో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది స్కాట్లాండ్...

మాథ్యూ వాట్ వికెట్‌తో అత్యధిక టీ20 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా యజ్వేంద్ర చాహాల్‌ను అధిగమించి, టాప్‌లో నిలిచాడు జస్ప్రిత్ బుమ్రా... 

Follow Us:
Download App:
  • android
  • ios