ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా గెలిస్తే, నేటి సాయంత్రమే టీ20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటన... లేదంటే రేపు ఉదయం ప్రకటించే అవకాశం...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి జట్టును ప్రకటించేందుకే ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. టోర్నీ ఆడే జట్లన్నీ సెప్టెంబర్ 10లోగా తమ టీమ్ సభ్యుల వివరాలను ప్రకటించాల్సింది డెడ్‌లైన్ విధించింది ఐసీసీ...

లెక్క ప్రకారం టీ20 వరల్డ్‌కప్ 2020 టోర్నీకి భారత్ వేదిక ఇవ్వాల్సింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ కూడా మధ్యలోనే బ్రేక్ పడడంతో టీ20 వరల్డ్‌కప్, యూఏఈకి మారింది...
టీ20 వరల్డ్‌కప్‌కి జట్టును ప్రకటించే సమయాన్ని ప్రకటించింది బీసీసీఐ.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా గెలిస్తే, నేటి సాయంత్రమే టీ20 వరల్డ్‌కప్ జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. ఒకవేళ రిజల్ట్ తేడా కొట్టి, ఈ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయినా, లేక మ్యాచ్ డ్రాగా ముగిసినా రేపు ఉదయం టీ20 వరల్డ్‌కప్ జట్టును ప్రకటించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుందట...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, పృథ్వీషా మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. వీరితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఓపెనింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వీరితో పాటు శిఖర్ ధావన్ కూడా ప్లేస్ ఆశిస్తున్నాడు.

సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా... ఇలా టీ20 వరల్డ్‌కప్ 2021లో ప్లేస్ కోసం దాదాపు 20 నుంచి 25 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు.