11:01 PM (IST) Oct 24

నయా చరిత సృష్టించిన పాక్.. భారత్ పై సూపర్ విక్టరీ

152 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ కు దిగిన పాక్.. మరో 12 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఆ జట్టు ఓపెనర్లే విజయాన్ని ఖరారు చేశారు. బాబర్ ఆజమ్ (68), మహ్మద్ రిజ్వాన్ (79) పరుగులతో చెలరేగారు. భారత బౌలర్లు అట్టర్ ప్లాఫ్ అయ్యారు.

Scroll to load tweet…
10:47 PM (IST) Oct 24

ఇక ఆశలు వదులుకోవడమేనా..?

16 వ ఓవర్ ముగిసేసరికి పాక్ ఓపెనర్లు 128 పరుగులు చేశారు. పాక్ విజయానికి 4 ఓవర్లలో పాతిక పరుగులు అవసరముంది. ఇక భారత్ అభిమానులు ఆశలు వదులుకోవాల్సిందేనా..?

10:42 PM (IST) Oct 24

విజయానికి 32 పరుగులే..

పాక్ విజయానికి మరో 32 పరుగులే బాకీ ఉంది. ఓపెనర్లిద్దరూ క్రీజులో పాతుకుపోయారు. 15 ఓవర్లు ముగిసేసరికి పాక్ 121 పరుగులు చేసింది. బుమ్రా 9 పరుగులిచ్చాడు. రిజ్వాన్ (56), బాబర్ (62) క్రీజులో ఉన్నారు. 

10:37 PM (IST) Oct 24

14 ఓవర్లకు 112/0

14 ఓవర్లు ముగిసేసరికి పాక్ 112 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. రిజ్వాన్ (48), బాబర్ (61) క్రీజులో పాతుకుపోయారు. 

10:33 PM (IST) Oct 24

రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు.. దూకుడు పెంచిన పాకిస్థాన్

పాకిస్థాన్ ఓపెనర్లు దూకుడు పెంచారు. వరుణ్ చక్రవర్తి వేసిన 13వ ఓవర్ లో మహ్మద్ రిజ్వాన్, బాబర్ చెరో సిక్సర్ బాదారు. ఈ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. బాబర్ (52), రిజ్వాన్ (46) క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి ఇంకా 42 బంతుల్లో 51 పరుగులు మాత్రమే కావాలి. 13 వ ఓవర్ ముగిసేసరికి పాక్ స్కోరు వికెట్ నష్టపోకుండా 101.

10:28 PM (IST) Oct 24

తేలిపోతున్న భారత బౌలర్లు

12 వ ఓవర్ ముగిసేసరికి పాక్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 85 పరుగులుగా ఉంది. భారత బౌలర్లు తేలిపోతున్నారు. బాబర్ ఆజమ్ (44), రిజ్వాన్ (38) క్రీజులో ఉన్నారు.

10:20 PM (IST) Oct 24

పది ఓవర్లకు పాక్ స్కోరు 71/0

పది ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు 71/0. పాక్ ఓపెనర్లుగా వచ్చిన బాబర్ ఆజమ్ (34), మహ్మద్ రిజ్వాన్ (35) నిలకడైన ఆటతీరుతో భారత అభిమానుల గుండెల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నారు. ఈ మ్యాచ్ గెలవాలంటే పాక్.. మరో 60 బంతుల్లో 81 పరుగులు చేయాలి. ఇంకా పది వికెట్లు చేతిలో ఉన్నాయి. 

Scroll to load tweet…

10:13 PM (IST) Oct 24

కరుగుతున్న లక్ష్యం.. కానరాని వికెట్

మ్యాచ్ మొదలై 9 ఓవర్లైనా భారత్ కు ఇంకా వికెట్ దక్కలేదు. మరోవైపు ఛేదించాల్సిన లక్ష్యం కరిగిపోతున్నది. 9 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. జడేజా వేసిన ఈ ఓవర్ లో పది పరుగులొచ్చాయి. బాబర్ సిక్సర్ బాదాడు. 

10:09 PM (IST) Oct 24

50 దాటిన పాక్..

8 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు 50 పరుగులు దాటింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్ లో ఆరు పరుగులొచ్చాయి. బాబర్ (20), రిజ్వాన్ (30) క్రీజులో కుదురుకుంటున్నారు. విజయానికి పాక్ ఇంకా 72 బంతుల్లో 100 పరుగులు చేయాలి. ప్రస్తుతం 52/0.

10:05 PM (IST) Oct 24

7 ఓవర్లకు పాక్ 46/0

ఏడు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు 46/0. బాబర్ (18), రిజ్వాన్ (27) క్రీజులో ఉన్నారు. 

09:58 PM (IST) Oct 24

చెరో ఫోర్ బాదిన బాబర్, రిజ్వాన్.. నిలకడగా పాక్ బ్యాటింగ్

మహ్మద్ షమీ వేసిన ఐదో ఓవర్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, రిజ్వాన్ తలో ఫోర్ బాదారు. ఫలితంగా 5 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 35/0 గా ఉంది. రిజ్వాన్ (21), బాబర్ (14) క్రీజులో ఉన్నారు. పాకిస్థాన్ ఓపెనరర్లు నిలకడగా ఆడుతున్నారు.

Scroll to load tweet…

09:52 PM (IST) Oct 24

నాలుగో ఓవర్లో రెండే పరుగులు

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కు వచ్చాడు. ఈ ఓవర్లో రెండు పరుగులే వచ్చాయి. తొలి ఓవర్ లో రెచ్చిపోయిన రిజ్వాన్, బాబర్ లు నిలకడగా ఆడుతున్నారు. 4 ఓవర్లకు పాక్ 24/0. 

09:47 PM (IST) Oct 24

3 ఓవర్లకు పాక్ స్కోరు 22/0

మూడు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ వికెట్లేమీ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. బాబర్ (8), రిజ్వాన్ (14) ఆడుతున్నారు. 

09:42 PM (IST) Oct 24

రెండో ఓవర్లో 8 పరుగులు

మహ్మద్ షమీ వేసిన రెండో ఓవర్ లో ఎనిమిది పరుగులొచ్చాయి. బాబర్ ఆజమ్ (5) ఖాతా తెరిచాడు. మహ్మద్ రిజ్వాన్ (13) క్రీజులో ఉన్నాడు. రెండు ఓవర్లకు పాక్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 18 పరుగులు. 

09:37 PM (IST) Oct 24

ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. తొలి ఓవర్లో10/0

భారత్ నిర్దేశించిన 152 పరుగుల విజయలక్ష్యాన్ని సాధించడానికి పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (0), మహ్మద్ రిజ్వాన్ (10) బ్యాటింగ్ కు దిగారు. తొలి ఓవర్ లోనే రిజ్వాన్ ఫోర్, సిక్సర్ తో 10 పరుగులు రాబట్టాడు. మొదటి ఓవర్ లో భువనేశ్వర్ పది పరుగులిచ్చాడు. 

09:21 PM (IST) Oct 24

20 ఓవర్లకు భారత్ 151/7.. పాక్ విజయలక్ష్యం 152

పాకిస్థాన్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఆఖరు ఓవర్లో స్కోరును పెంచే యత్నంలో హార్ధిక్ పాండ్యా (11) ఔట్ అయ్యాడు. పాకిస్థాన్ విజయం లక్ష్యం 152 పరుగులు. 

09:14 PM (IST) Oct 24

19 ఓవర్లకు టీమిండియా స్కోరు144 /6

19 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 144/6. హార్ధిక్ పాండ్యా (9), భువనేశ్వర్ కుమార్ (1) క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్ లో రెండు ఫోర్లు, నోబ్ తో పాటు ఓవర్ త్రో రూపంలో 16 పరుగులొచ్చాయి. 

09:10 PM (IST) Oct 24

కోహ్లి ఔట్

విరాట్ కోహ్లి (57) ఔట్. షాహీన్ అఫ్రిది వేసిన 18.3 ఓవర్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చిన విరాట్. షాహీన్ కు మూడు వికెట్లు.

09:06 PM (IST) Oct 24

కోహ్లి హాఫ్ సెంచరీ.. జడ్డూ ఔట్.. 18 ఓవర్లకు టీమిండియా 127/5

భారత సారథి కోహ్లి (57) హాఫ్ సెంచరీ సాధించాడు. హసన్ అలీ వేసిన 18వ ఓవర్లో కోహ్లి, రవీంద్ర జడేజా చెరో ఫోర్ బాదారు. కానీ ఐదో బంతికి భారీ షాట్ కు యత్నించిన జడ్డూ (13).. క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. అతడి స్థానంలో హార్ధిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్ లో 13 పరుగులొచ్చాయి. 

08:59 PM (IST) Oct 24

హాఫ్ సెంచరీకి చేరువలో కోహ్లి..

సహచరులంతా అలా వచ్చి ఇలా వెళ్తున్న చోట భారత సారథి నిలకడగా ఆడుతున్నాడు. 44 బంతులాడిన కోహ్లి.. హాఫ్ సెంచరీకి మరో రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక 17 వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 4 వికెట్లకు 114. రవీంద్ర జడేజా (9) క్రీజులో ఉన్నాడు.