Asianet News TeluguAsianet News Telugu

T20 worldcup 2021: ఇంగ్లాండ్ ఈజీ విక్టరీ... ఆస్ట్రేలియాను చిత్తు చేసి, దాదాపు సెమీస్‌లోకి...

T20 worldcup 2021: 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్... 11.4 ఓవర్లలో మ్యాచ్‌ని ముగించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్...

T20 worldcup 2021: England beats Australia, and registers third consecutive win in super 12 round
Author
India, First Published Oct 30, 2021, 10:28 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021   టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ఇంగ్లాండ్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది ఇంగ్లాండ్. 126 పరుగుల టార్గెట్‌ను జెడ్ స్పీడ్‌తో మొదలెట్టిన ఇంగ్లాండ్, కేవలం 11.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది...

ఓపెనర్లు జాసన రాయ్, జోస్ బట్లర్ మొదటి ఓవర్ నుంచి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 6.1 ఓవర్లలో 66 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడిని ఆడమ్ జంపా విడదీశాడు. 20 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 22 పరుగులు చేసిన జాసన్ రాయ్, జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన ఆసీస్‌కి అనుకూలంగా ఫలితం వచ్చింది.

ఆ తర్వాత డేవిడ్ మిల్లయర్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి అస్టన్ అగర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో కలిసి మ్యాచ్‌ని ముగించారు. జోస్ బట్లర్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు, జానీ బెయిర్ స్టో 11 బంతుల్లో 2 సిక్సర్లతో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

ఇదీ చదవండి: వెన్నెముక లేని వెధవలు, మతం పేరుతో దూషిస్తారా... మహ్మద్ షమీపై వచ్చిన ట్రోల్స్‌పై విరాట్ కోహ్లీ ఫైర్...

ఈ విజయంతో హ్యాట్రిక్ విజయాలు నమోదుచేసుకున్న ఇంగ్లాండ్, దాదాపు సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. మరో మ్యాచ్ గెలిస్తే, అధికారికంగా సెమీస్ చేరుతుంది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియాకి బంతుల పరంగా చూస్తే టీ20ల్లో ఇదే అతిపెద్ద ఓటమి. 50 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది ఇంగ్లాండ్. 

 అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియాకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 1 పరుగు చేసిన డేవిడ్ వార్నర్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ అవుట్‌గా ప్రకటించకపోయినా వార్నర్ స్వచ్ఛందంగా పెవిలియన్‌కి చేరుకున్నాడు. 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా...

must Read: ఇలా అయితే ఆ జట్లకి స్టార్ క్రికెటర్లు ఎలా దొరుకుతారు... ఐపీఎల్ 2022 రిటెన్షన్ పాలసీపై ఆకాశ్ చోప్రా...

ఆ తర్వాతి ఓవర్‌లో 5 బంతుల్లో 1 పరుగు చేసిన స్టీవ్ స్మిత్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌తో అవుట్ అయ్యాడు. గత 15 టీ20 ఇన్నింగ్స్‌ల్లో స్టీవ్ స్మిత్ సింగిల్ డిజిట్ స్కోరుకి అవుట్ కావడం ఇదే తొలిసారి... ఆ తర్వాత 9 బంతుల్లో 6 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్ రివ్యూకి వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ 4 బంతుల్లో డకౌట్ అయ్యాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు స్టోయినిస్. 21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా...

18 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన మాథ్యూ వేడ్, లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో జాసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 51 పరుగుల వద్ద ఐదో వికెట్ పడింది. ఈ దశలో ఆరోన్ ఫించ్, ఆస్టన్ అగర్ కలిసి ఆరో వికెట్‌కి పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు... ఈ దశలో ఇంగ్లాండ్‌పై అత్యధిక టీ20 పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీని అధిగమించి, 580+ పరుగులతో టాప్‌లోకి వెళ్లాడు ఆరోన్ ఫించ్. ఓపెనర్‌గా అత్యధిక సార్లు 30+ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా మార్టిన్ గుప్టిల్ (40 సార్లు), తర్వాతి స్థానంలో (39 సార్లు) నిలిచాడు ఆరోన్ ఫించ్. 

20 బంతుల్లో 2 సిక్సర్లతో 20 పరుగులు చేసిన అస్టన్ అగర్, తైముల్ మిల్స్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు తీశాడు క్రిస్ జోర్డాన్...
49 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే వరుస రెండు సిక్సర్లతో 12 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు జోర్డాన్...

ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 ఓవర్లలో  17 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీశాడు. అదిల్ రషీద్ 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీయగా లియామ్ లివింగ్‌స్టోన్ ఓ వికెట్ తీసి 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు... 

Follow Us:
Download App:
  • android
  • ios