Afghanistan vs Scotland: 191 పరుగుల లక్ష్యఛేదనలో 60 పరుగులకే ఆలౌట్ అయిన స్కాట్లాండ్... ముజీబ్‌కి ఐదు వికెట్లు, 4 వికెట్లు తీసిన రషీద్ ఖాన్..

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయంతో ఆరంభించింది. గ్రూప్ టాపర్‌గా సూపర్ 12 రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది ఆఫ్ఘాన్... 60 పరుగులకే ఆలౌట్ అయిన స్కాట్లాండ్, టీ20ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసుకుంది.

191 పరుగుల కొండంత లక్ష్యఛేదనను అదిరిపోయే రేంజ్‌లో ప్రారంభించింది స్కాట్లాండ్... మొదటి 3 ఓవర్లు ముగిసేసరికి 27/0 పరుగులు చేశారు ఓపెనర్లు. అయితే నాలుగో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన ముజీబ్ వుర్ రహ్మాన్... మ్యాజ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చి వేశాడు..

must READ: ఇండియా ఓడిందని మనవాళ్లే టపాసులు కాల్చారు, దీపావళి రోజు కాలిస్తే తప్పేంటి... సెహ్వాగ్ ట్వీట్...

7 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన కోట్రెజ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన ముజీబ్, ఆ తర్వాతి బంతికి మాక్‌లాడ్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. రెండు డాట్ బాల్స్ తర్వాత బెరింగ్టన్ కూడా ముజీబ్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

మాక్‌లాడ్, బెరింగ్టన్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్నా, టీవీ రిప్లైలో అంపైర్ కాల్స్‌గా రావడంతో నిరాశగా వెనుదిరిగారు. ఆ తర్వాతి ఓవర్‌లో మాథ్యూ క్రాస్ కూడా డకౌట్ అయ్యాడు. నవీన్ వుల్ హక్ బౌలింగ్‌లో మాథ్యూ క్రాస్ ఇచ్చిన క్యాచ్, డ్రైవ్ చేస్తూ అద్భుతంగా ఒడిసిపట్టాడు వికెట్ కీపర్ మహ్మద్ షాజాద్...

Read also: IPL AUCTION: 2022 ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే... అహ్మదాబాద్, లక్నో నగరాల పేర్లతో...

స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో మూడు, నాలుగు, ఐదో బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం విశేషం. 2014లో శ్రీలంకపై న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మెక్‌కల్లమ్, రాస్ టేలర్, జేమ్స్ నీశమ్ డకౌట్ అయిన తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 

3 పరుగుల తేడాలో 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది స్కాట్లాండ్. 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన ఓపెనర్ మున్సే కూడా ముజీబ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. లీస్క్‌ను రషీద్ ఖాన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చగా... 1 పరుగు చేసిన మార్క్ వ్యాట్‌ను బౌల్డ్ చేసిన ముజీబ్... ఐదు వికెట్లను పూర్తి చేసుకున్నాడు...

ఇవి కూడా చదవండి: ఇతన్నేనా మిస్టరీ స్పిన్నర్ అంటూ దాచారు, తనకంటే పదో క్లాస్ పిల్లలే నయం... పాక్ మాజీ పేసర్ కామెంట్స్...

టీ20 వరల్డ్‌కప్‌‌ టోర్నీలో ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ముజీబ్, 2016లో హాంకాంగ్‌పై మహ్మద్ నబీ తీసిన 4/20 పర్ఫామెన్స్‌ను బ్రేక్ చేశాడు.. ఆ తర్వాత క్రిస్ గ్రేవ్స్ 12 బంతుల్లో 12 పరుగులు, డావే 4 పరుగులు , వీల్ వికెట్లను తీసిన రషీద్ ఖాన్... స్కాట్లాండ్‌‌ను చుట్టేశాడు.

స్కాట్లాండ్‌కి ఇదే టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో అత్యల్ప స్కోరు కాగా, ఓవరాల్‌గా ఐదో లోయెస్ట్ స్కోరు. ఇంతకుముందు నెదర్లాండ్స్ 39, 44, వెస్టిండీస్ 55, న్యూజిలాండ్ 60 పరుగులకు ఆలౌట్ అయి స్కాట్లాండ్ కంటే ముందున్నాయి. 130 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆఫ్ఘాన్, కెన్యాపై 2007లో శ్రీలంక అందుకున్న 172 పరుగుల విజయం తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో అతిపెద్ద విజయాన్ని నమోదుచేసింది.