2021 ఏడాదికి గానూ మహ్మద్‌ రిజ్వాన్‌ పాకిస్తాన్‌ తరపున టి20ల్లో 1666 పరుగులు సాధించాడు. ఇక పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 2021 క్యాలెండర్‌లో 1561 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతుండడం విశేషం. 


T20 worldcup పాకిస్తాన్ అదరగొడుతోంది. ఈ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. పాకిస్తాన్ జట్టు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్.. అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. సింగిల్ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో.. పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ చోటు సంపాదించుకున్నాడు.

2021 ఏడాదికి గానూ మహ్మద్‌ రిజ్వాన్‌ పాకిస్తాన్‌ తరపున టి20ల్లో 1666 పరుగులు సాధించాడు. ఇక పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 2021 క్యాలెండర్‌లో 1561 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతుండడం విశేషం. 

ఇక ఇంతకముందు క్రిస్‌ గేల్‌(2015 ఏడాదిలో 1665 పరుగులు), విరాట్‌ కోహ్లి(2014 ఏడాదిలో 1614 పరుగులు), బాబర్‌ అజమ్‌(2019 ఏడాదిలో 1607 పరుగులు), ఏబీ డివిలియర్స్‌(2019 ఏడాదిలో 1580 పరుగులు) చేశారు.

Also Read: ఆ మ్యాచ్‌కి ముందే పిచ్ క్యూరేటర్ ఆత్మహత్య... ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ విషయంలో...

ఇదిలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ జట్టు వరుసగా ఐదు విజయాలు అందుకుంది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో విజయం అందుకున్న పాకిస్తాన్, సూపర్ 12 రౌండ్‌లో ఐదు విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. గ్రూప్ 1లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్టు నాలుగేసి విజయాలు మాత్రమే అందుకోగలిగాయి.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు మెరుగైన రన్‌రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా సౌతాఫ్రికా జట్టు నాలుగు విజయాలు అందుకున్నప్పటికీ నెట్ రన్ రేటు తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ 2లో మాత్రం నెట్ రన్ రేట్ అవసరం రాలేదు... పాకిస్తాన్ వరుసగా ఐదు విజయాలతో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరగా, ఆఫ్ఘాన్‌ను ఓడించి నాలుగో విజయం అందుకున్న న్యూజిలాండ్ కూడా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది.

నవంబర్ 10న జరిగే మొదటి సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్, 11న జరిగే సెమీ ఫైనల్ 2లో పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా జట్టు తలబడబోతున్నాయి. 190 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన స్కాట్లాండ్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగుతున్నట్టు కనిపించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 117 పరుగులకి పరిమితమైంది. జార్జ్ మున్సే 31 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు, కెప్టెన్ కేల్ 16 బంతుల్లో 9 పరుగులు, మాథ్యూ క్రాస్ 5 పరుగులు, మైకెల్ లీస్క్ 14 పరుగులు చేసి అవుట్ కాగా, బడ్జ్ డకౌట్ అయ్యాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన రిచీ బెర్రింగ్టన్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన బెర్రింగ్టన్ నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 19 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఏడాది టీ20ల్లో 1667 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, ఒక ఏడాదిలో అత్యధిక టీ20 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.