Asianet News TeluguAsianet News Telugu

ఆ మ్యాచ్‌కి ముందే పిచ్ క్యూరేటర్ ఆత్మహత్య... ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ విషయంలో...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో అబుదాబి స్టేడియానిక పిచ్ క్యూరేటర్‌గా వ్యవహరించిన మోహన్ సింగ్... ఆఫ్ఘాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌కి ముందు ఆత్మహత్య...

T20 Worldcup 2021: Afghanistan vs New Zealand pitch curator committed suicide before match
Author
India, First Published Nov 7, 2021, 8:59 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల అటెక్షన్ పొందిన మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్. భారత జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు ఈ మ్యాచ్ ఫలితం మీద ఆధారపడి ఉండడంతో ఆఫ్ఘన్, న్యూజిలాండ్ మ్యాచ్‌కి భారీ హైప్ వచ్చింది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్, న్యూజిలాండ్‌ని ఓడించి ఉంటే భారత జట్టుకి ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగు పడేవి.

అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎప్పుడూ వెంటాడే బ్యాడ్ లక్ ఈ మ్యాచ్ సమయంలోనూ వదల్లేదు...న్యూజిలాండ్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో ఓడిన ఆఫ్ఘనిస్తాన్, టీ20 వరల్డ్ కప్ 2021 ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడమే కాకుండా టీమిండియాను కూడా ఇంటికి పంపించింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఓ సంఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

షేక్ జాయెద్ స్టేడియానికి పిచ్ క్యూరేటర్ ఉన్న మోహన్ సింగ్, అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. భారత జట్టుకి అత్యంత కీలకంగా మారిన ఈ మ్యాచ్‌కి క్యూరెటర్‌గా వ్యవహరించింది ఓ భారతీయుడు కావడం విశేషం... 2004కి ముందు వరకూ పంజాబ్‌లోని ప్రఖ్యాత మొహాలీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పిచ్ క్యూరేటర్‌గా శిక్షణ తీసుకున్న మోహన్ సింగ్, ఆ తర్వాత యూఏఈలోని అబుదాబికి చేరుకుని, అక్కడే సెటిల్ అయ్యాడు...

మోహాలీలో మొదట గ్రౌండ్ సూపర్ వైజర్‌గా పనిచేసిన మోహన్ సింగ్, కోచింగ్ స్టాఫ్‌గా, సపోర్టింగ్ స్టాఫ్‌గా 10 ఏళ్ల పాటు వివిధ పనుల్లో శిక్షణ పొంది, యూఏఈ చేరుకున్నాడు. దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉన్న మోహన్ సింగ్, ఆఫ్ఘానిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్‌ మ్యాచ్ ఆరంభానికి ముందు అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించాడు. 

మోహన్ సింగ్ మరణానికి కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదు. అయితే కీలక మ్యాచ్‌కి ముందు భారతీయుల ఒత్తిడిని తట్టుకోలేక మోహన్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. మోహన్ సింగ్ అకాల మరణంపై బీసీసీఐ మాజీ పిచ్ క్యూరేటర్ దల్జీత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశాడు. 

కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ, స్కాట్లాండ్, నమీబియాలతో మ్యాచ్‌ల్లో అచొచ్చిందనే ఉద్దేశంతో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. నజీబుల్లా జాద్రాన్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు.

125 పరుగుల టార్గెట్‌ను 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది న్యూజిలాండ్... మార్టిన్ గుప్టిల్ 23 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేయగా, డార్ల్ మిచెల్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ కేన్ విలియంసన్ 42 బంతుల్లో 3 ఫోర్లతో 40 పరుగులు చేయగా డివాన్ కాన్వే 32 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios