Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup 2024 : భార‌త్ దెబ్బ‌కు బిత్త‌ర‌పోయిన ఇంగ్లండ్..

IND vs ENG, T20 World Cup 2024 :  టీ20 ప్ర‌పంచ క‌ప్ సెమీ ఫైన‌ల్లో అద్భుత‌మైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డిండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించి టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఫైన‌ల్ కు చేరింది టీమిండియా. ఈ విజ‌యంతో 2023లో ఓట‌మికి ఇంగ్లండ్ పై ప్ర‌తీకారం తీర్చుకుంది రోహిత్ సేన‌.
 

T20 World Cup 2024 : England is devastated by India's blow, Team India's super show in batting, bowling and fielding RMA
Author
First Published Jun 28, 2024, 2:23 AM IST

IND vs ENG, T20 World Cup 2024 : ఎవ‌డు కొడితే దిమ్మ‌దిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అదే టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ 2024 లో భార‌త్ దెబ్బ‌కు మొద‌ట ఆస్ట్రేలియా టోర్నీ నుంచి ఎగిరి అవ‌త‌లప‌డింది. ఇప్పుడు టీ20 ప్ర‌పంచ క‌ప్ రెండవ సెమీ-ఫైనల్‌లో భార‌త్ దెబ్బ‌కు ఇంగ్లాండ్ కు మైండ్ బ్లాక్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో టీమిండియా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లాండ్ ఆట‌గాళ్ల‌కు ఏం చేయాలో తోచ‌లేదు. చివ‌ర‌కు భార‌త్ చేతిలో చిత్తుగా ఓడి ఇంటిదారి ప‌ట్టారు. రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని టీమిండియా వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్ కు చేరుకుంది.

బ్యాటింగ్ లో రోహిత్ సూర్య‌ల‌తో మొద‌లు.. 

ఐసీసీ క‌ప్ గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా మెగా టోర్నీకి వ‌చ్చిన భార‌త జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో ఒక్క అడుగుదూరంలో ఉంది. ఇంగ్లాండ్ తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు మంచి స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ, రిష‌బ్ పంత్, శివ‌మ్ దూబే వంటి కీల‌క ప్లేయ‌ర్లు నిరాశ‌ప‌రిచినా.. సూర్య‌కుమార్ యాద‌వ్ తో క‌లిసి హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. వ‌రుస‌గా రెండో హాఫ్ సెంచ‌రీ (57 ప‌రుగులు) సాధించారు. సూర్య‌కుమార్ యాద‌వ్ 3 ప‌రుగుల దూరంలో హాఫ్ సెంచ‌రీ కోల్పోయాడు. 47 ప‌రుగుల కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. వీరికి తోడుగా హార్దిక్ పాండ్యా 23, ర‌వీంద్ర జ‌డేజా 17*, అక్ష‌ర్ ప‌టేల్ 10 ప‌రుగులు చేయ‌డంలో టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల లో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు తీసుకున్నాడు.

భార‌త బౌల‌ర్లు అద్భుతం చేశారు.. 

ఈ మ్యాచ్ లో బ్యాటింత్ తో పాటు బౌలింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది భార‌త జ‌ట్టు. బౌలింగ్ విభాగం స‌మిష్టి కృషితో భార‌త జ‌ట్టు ఏకంగా 68 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ పై సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. 172 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ ను భార‌త బౌల‌ర్లు బెంబేలెత్తించారు. అద్భుత‌మైన బౌలింగ్ తో ఇంగ్లండ్ ప్లేయ‌ర్ల‌ను వ‌రుస‌గా పెవిలియ‌న్ పంపారు. అక్ష‌ర్ ప‌టేల్ జోస్ బ‌ట్ల‌ర్ వికెట్ తో మొద‌లు పెట్ట‌గా, జోఫ్రా ఆర్చ‌ర్ వికెట్ తో ఇంగ్లాండ్ శుభం కార్డు వేశాడు జ‌స్ప్రీత్ బుమ్రా. అక్ష‌ర్ ప‌టేల్ కీల‌క‌మైన జోస్ బ‌ట్ల‌ర్, మొయిన్ అలీ, జానీ బెయిర్ స్టోల 3 వికెట్లు తీసుకున్నాడు. ఆ త‌ర్వాత కుల్దీప్ యాద‌వ్ త‌న స్పీన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డ‌ర్ ను దెబ్బ‌కొట్టాడు. హ్యారీ బ్రూక్, సామ్ క‌ర్రాన్, క్రిస్ జోర్డాన్ వికెట్లు తీసుకున్నాడు. ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్ వికెట్ల‌ను బుమ్రా తీసుకున్నాడు. మొత్తంగా అక్ష‌ర్ కు 3, కుల్ దీప్ కు 3, బుమ్రాకు 2 వికెట్లు ప‌డ్డాయి.

సూప‌ర్ ఫీల్డింగ్ తో ఇంగ్లాండ్ కు షాకిచ్చారు.. 

బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ భార‌త జ‌ట్టు సూప‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. ఆదిల్ రషీద్ ను సూర్య‌కుమార్ యాద‌వ్ సూప‌ర్ ఫీల్డింగ్ తో ర‌నౌట్ చేశాడు. అలాగే, లియామ్ లివింగ్‌స్టోన్ ను కుల్దీప్ యాదవ్-అక్సర్ ప‌టేల్ లు ర‌నౌట్ చేశారు. బ్యాటింగ్ లో విఫ‌ల‌మైన రిష‌బ్ పంత్ ఫీల్డింగ్ లో మ‌రోసారి అద‌ర‌గొట్టాడు. పంత్ రెండు క్యాచ్ ల‌ను అందుకున్నాడు.

అద్భుతమైన మైలురాయిని అందుకుంటూ కోహ్లీ, ధోని, గంగూలీల‌ ఎలైట్ గ్రూపులో చేరిన‌ రోహిత్ శ‌ర్మ


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios