IND vs IRE: టీ20 ప్రపంచకప్ 2024లో భార‌త జ‌ట్టు త‌న తొలి ఫైట్ లో ఐర్లాండ్ తో త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్ లో పిచ్ స్లోగా ఉండ‌టంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ ను హార్దిక్ పాండ్యా, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ లు సూప‌ర్ బౌలింగ్ తో చెడుగుడు ఆడుకున్నారు.  

T20 World Cup 2024, IND vs IRE: అమెరికా, వెస్టిండీస్ వేదిక‌లుగా జ‌రుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భార‌త్ త‌న తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ ను ఇండియ‌న్ బౌల‌ర్లు అద‌ర‌గొట్టారు. అద్భుత‌మైన బౌలింగ్ తో ఐర్లాండ్ ఆట‌గాళ్ల‌ను చెడుగుడు ఆడుకున్నారు. ఓపెనింగ్ బౌలింగ్ తో ఐర్లాండ్ కు చెమ‌ట‌లు ప‌ట్టించాడు అర్ష్ దీప్ సింగ్. 2 ప‌రుగుల వ‌ద్ద ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ను బోల్తా కొట్టించాడు. ఆ త‌ర్వాత మ‌రో ఓపెన‌ర్ ఆండ్రూ బాల్బిర్నీని పెవిలియ‌న్ కు పంపాడు.

విమ‌ర్శ‌ల‌కు త‌న బౌలింగ్ తో స‌మాధానమిచ్చిన హార్దిక్..

ఇటీవ‌ల త‌న పేల‌వ‌ ఫామ్ పై తీవ్ర విమ‌ర్శ‌లు ఏదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 వార్మ‌ప్ మ్యాచ్ లో అద‌ర‌గొట్టాడు. ఇప్పుడు త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ఐర్లాండ్ మ్యాచ్ లో త‌న అద్బుత‌మైన బౌలింగ్ తో కౌంట‌ర్ ఇచ్చాడు. వ‌రుస‌గా రెండు ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు తీసుకుని అద‌ర‌గొట్టాడు. త‌న తొలి ఓవ‌ర్ లో ఐర్లాండ్ వికెట్ కీప‌ర్ లోర్కాన్ టక్కర్ అద్భుతమైన బౌలింగ్ తో ఔట్ చేశాడు. ఈ సూప‌ర్ బాల్ కు మిడిల్ వికెట్ ఎగిరిప‌డింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది. అలాగే, త‌న మూడో ఓవ‌ర్ తొలి బంతికే కర్టిస్ కాంఫర్ ను పెవిలియ‌న్ కు పంపాడు.

Scroll to load tweet…

"భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ అంచనాలు-హైప్ భయాన్ని క‌లిగిస్తున్నాయి.." అస‌లు ఏం జ‌రుగుతోంది భ‌య్యా.. !