టీ20 వరల్డ్ కప్ 2022: నమీబియాకి షాక్ ఇచ్చిన నెదర్లాండ్స్... ఆసక్తికరంగా మారిన గ్రూప్-ఏ మ్యాచులు...

T20 World cup 2022: నమీబియాపై 5 వికెట్ల తేడాతో నెగ్గిన నెదర్లాండ్స్... వరుసగా రెండు విజయాలతో సూపర్ 12 రౌండ్‌కి చేరువైన నెదర్లాండ్స్... 

T20 World cup 2022: Netherlands beats Namibia in low scoring game, Group A matches become

టీ20 వరల్డ్ కప్ 2022 తొలి మ్యాచ్‌లో ఆసియా కప్ ఛాంపియన్‌ శ్రీలంకను 55 పరుగుల తేడాతో చిత్తు చేసిన నమీబియాకి రెండో మ్యాచ్‌లో షాక్ తగిలింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది నమీబియా. మొదటి మ్యాచ్‌లో యూఏఈపై నెగ్గిన నెదర్లాండ్స్‌కి ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో లంకకి షాక్ ఇచ్చిన నమీబియా కూడా రేసులో ఉండడంతో ఆసియా కప్ ఛాంపియన్ శ్రీలంక సూపర్ 12 రౌండ్‌కి చేరాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకోవాల్సి ఉంటుంది...  

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. డివాన్ లా కాక్ డకౌట్ కాగా 19 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన మైకెల్ వాన్ లింగన్‌ని అకీర్‌మాన్ అవుట్ చేశాడు. 22 బంతుల్లో 19 పరుగులు చేసిన బ్రాడ్‌ని వాన్ దేర్ మర్వీ అవుట్ చేయగా లోఫ్టీ ఈటెన్ డకౌట్ అయ్యాడు...

జాన్ ఫ్రైలింక్ 48 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేయగా కెప్టెన్ ఎరామస్ 18 బంతుల్లో 16 పరుగులు చేశాడు. వీజ్ 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు, జెజె స్మిత్ 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 

122 పరుగుల లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్‌కి శుభారంభం అందించారు ఓపెనర్లు .తొలి వికెట్‌కి 59 పరుగులు జోడించిన విక్రమ్‌జిత్ సింగ్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌ ఓడాన్ 35 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేశాడు...

టామ్ లూపర్ 6, కోలిన్ అకీర్‌మన్ డకౌట్ కాగా స్కాట్ ఎడ్వర్డ్స్ 1 పరుగుకే పెవిలియన్ చేరడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. ఒకానొక దశలో 92/1 పరుగులతో చేయాల్సిన పరుగుల కంటే బంతులు ఎక్కువగా ఉండడంతో ఈజీగా గెలిచేలా కనిపించిన నెదర్లాండ్స్, 10 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయి 102/5 స్థితికి చేరుకుంది.

17వ ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వకుండా వికెట్ మెయిడిన్ వేసిన ఫ్రైలింక్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 18వ ఓవర్‌లో కూడా 6 పరుగులే రావడంతో చివరి 2 ఓవర్లలో నెదర్లాండ్స్ విజయానికి 14 పరుగులు కావాల్సి వచ్చాయి.  జెజె స్మిత్ వేసిన 19వ ఓవర్‌లో బౌండరీ రాకపోయినా టిమ్ ప్రింగల్, బస్ డే లీడే కలిసి 8 పరుగులు రాబట్టారు. దీంతో నెదర్లాండ్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి...

మొదటి బంతికే ఫోర్ బాదిన బస్ డే లీడ్, నెదర్లాండ్స్ విజయాన్ని ఖాయం చేసేశాడు. రెండో బంతికి పరుగులేమీ రాకపోయినా మూడో బంతికి 2 పరుగులు తీసి మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు లీడ్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios