Asianet News TeluguAsianet News Telugu

టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ పోటీ పాక్, ఇండియా మధ్యే: షోయబ్ అక్తర్

ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ కచ్చితంగా భారత్- పాకిస్తాన్ ల మధ్య మాత్రమే జరుగుతుందని ఆయన అన్నారు. 2007 లోమ జరిగిన మ్యాచ్ మళ్లీ రిపీట్ అవుతుందని అక్తర్ పేర్కొన్నారు.

T20 World Cup 2021: THIS pace legend predicts India vs Pakistan final
Author
Hyderabad, First Published Jul 23, 2021, 2:51 PM IST

క్రికెట్ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది అక్టోబర్ లో ఐసీసీ( ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) నిర్వహించనుంది. ఇది గతేడాదే జరగాల్సి ఉండగా... కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో.. ఈ ఏడాది అక్టోబర్ లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 12జట్లు పాల్గొననున్నాయి. మెయిన్ ట్రాలో రెండు గ్రూపులుగా విడదీస్తారు. దానిలో క్వాలిఫై అయిన వారు.. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ చేరుకుంటారు. 

కాగా.. ఈ టీ20 వరల్డ్ కప్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ జోస్యం చెప్పారు. ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ కచ్చితంగా భారత్- పాకిస్తాన్ ల మధ్య మాత్రమే జరుగుతుందని ఆయన అన్నారు. 2007 లోమ జరిగిన మ్యాచ్ మళ్లీ రిపీట్ అవుతుందని అక్తర్ పేర్కొన్నారు.

విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు.. ఫైనల్స్ లో తలపడే అవకాశం ఉందని అక్తర్ పేర్కొన్నాడు. 

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కి  ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. యూఏఈ వేదికగా ఈ ఫైనల్స్ జరిగే అవకాశం ఉందన్నాడు. యూఏఈ వేదిక భారత్, పాక్ లకు బాగా సెట్ అవుతుంది.. చివరకు విజయం మాత్రం పాకిస్తాన్ కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios