కశ్మీర్‌లో మరోసారి విరుచుకుపడిన పాక్ తీవ్రవాదులు, 24 గంటల్లో 9 ఎన్‌కౌంటర్లు... టీ20 వరల్డ్ ‌కప్ 2021 టోర్నీలో పాక్‌తో మ్యాచ్ క్యాన్సిల్ చేసుకోవాలంటూ నెటిజన్ల డిమాండ్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ప్రారంభమైంది. ఈ టోర్నీలో అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఏదైనా ఉందంటే అది అక్టోబర్ 24న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్. దాయాది దేశాల మధ్య రెండేళ్ల తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో ఈ మ్యాచ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది... భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి కూడా...

అయితే తాజాగా శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రభావం టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తోంది. గత 24 గంటల్లో దాదాపు శ్రీనగర్ ప్రాంతంలో దాదాపు 9 ఎన్‌కౌంటర్లు జరగగా, ఇందులో 13 మంది టెర్రరిస్టులను కాల్చివేసినట్టు పోలీసులు తెలియచేశారు. తీవ్రవాదుల దాడుల్లో ఓ పానీపూరీ వ్యాపారితో పాటు మరికొందరు ప్రాణాలు విడిచారు...

must read: వీడిన సస్పెన్స్, టీమిండియా తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్... 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ...

ఈ సంఘటనతో సోషల్ మీడియాలో భారత్, పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలని భారీ సంఖ్యలో డిమాండ్లు చేస్తూ, ‘ban pak cricket’ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. పాకిస్తాన్ తీవ్రవాదులు, భారత్‌పై దాడులు చేస్తూ, ఇక్కడి వారి ప్రాణాలు తీస్తుంటే, మీరు వారితో క్రికెట్ ఎలా ఆడతారంటూ కామెంట్లు చేస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్‌ 2021 టోర్నీలో పాకిస్తాన్ ‌తో మ్యాచ్ ఆడకపోతే మహా అయితే రెండు పాయింట్లు కోల్పోతామని, భారత ప్రజల ప్రాణాల కంటే అవేమీ ఎక్కువ కావంటూ పోస్టులు చేస్తున్నారు. పాక్‌తో మ్యాచులు రద్దు చేసుకోవడంతో పాటు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, టెర్రరిజం పెంచుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై బ్యాన్ విధించాలంటూ ఐసీసీకి డిమాండ్ చేస్తున్నారు.

also read:  IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

అయితే మరికొందరు క్రికెట్ అభిమానులు మాత్రం పాకిస్తాన్ తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవడం కంటే, వారిని చిత్తుగా ఓడించి.. ఈ హింసాత్మక చర్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు... చివరసారిగా 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగింది...

must read : అంతా తూచ్! రాహుల్ ద్రావిడ్‌కి హెడ్‌కోచ్ పదవిపై సస్పెన్స్... కోచ్ పదవులకి దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ..

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా...IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...