Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ శర్మ రికార్డు బ్రేక్, 34 బంతుల్లోనే సెంచరీ బాది... ఆండ్రూ సైమండ్స్ రికార్డు సమం చేసిన సీన్ అబ్బాట్...

34 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో  తొలి సెంచరీ అందుకున్న సీన్ అబ్బాట్... టీ20 బ్లాస్ట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఆండ్రూ సైమండ్స్ రికార్డు సమం చేసి అబ్బాట్..

T20 Blast: Sean Abbott equals the late Andrew Symonds the fastest T20 ton record CRA
Author
First Published May 27, 2023, 3:08 PM IST

ఓ వైపు ఐపీఎల్ సీజన్ 16 క్లైమాక్స్‌కి చేరుకుంటే మరో వైపు ఇంగ్లాండ్ లీగ్ టీ20 బ్లాస్ట్ ఘనంగా ప్రారంభమైంది. తాజాగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సీన్ అబ్బాట్, 34 బంతుల్లో సెంచరీ చేసి రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసేశాడు..

సుర్రే క్లబ్ తరుపున ఆడుతున్న సీన్ అబ్బాట్, 13 ఓవర్లలో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చాడు.  34 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 294.1 స్ట్రైయిక్ రేటుతో సెంచరీ అందుకున్న సీన్ అబ్బాట్, టీ20 ఫార్మాట్‌లో మొట్టమొదటి సెంచరీ అందుకున్నాడు...

సీన్ అబ్బాట్ ఇన్నింగ్స్‌లో కేవలం 5 డాట్ బాల్స్ మాత్రమే ఉండడం విశేషం. అబ్బాట్ ఇన్నింగ్స్‌లో సుర్రే 223 పరుగుల భారీ స్కోరు చేసింది. టీ20 ఫార్మాట్‌లో ఇది నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ. 

2013లో క్రిస్ గేల్, ఆర్‌సీబీతో తరుపున 30 బంతుల్లో సెంచరీ చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీగా ఉంది. ఆ తర్వాత 2018లో హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ రిషబ్ పంత్ 32 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. 

టీ20 ఆఫ్రికా కప్ 2018 టోర్నీలో నార్త్ వెస్ట్ ప్లేయర్ విహాన్ లబ్బే 33 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజాగా సీన్ అబ్బాట్ 34 బంతుల్లో సెంచరీ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. మొత్తంగా 41 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 110 పరుగులు చేసిన సీన్ అబ్బాట్, తాను ఎదుర్కొన్న మొదటి 17 బంతుల్లో 28 పరుగులే చేయడం విశేషం...

ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో 30 పరుగులు రాబట్టిన సీన్ అబ్బాట్, 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్ తర్వాత గేర్ మార్చిన సీన్ అబ్బాన్, మొదటి 17 బంతుల్లో 28 పరుగులు చేస్తే, తర్వాతి 17 బంతుల్లో ఏకంగా 72 పరుగులు రాబట్టాడు.. 

ఈ మ్యాచ్‌కి ముందు టీ20ల్లో సీన్ అబ్బాట్‌కి హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం విశేషం. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ అందుకున్న  రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన సీన్ అబ్బాట్, టీ20 బ్లాస్ట్‌లో 34 బంతుల్లో సెంచరీ అందుకున్న ఆండ్రూ సైమండ్స్ రికార్డును సమం చేశాడు.. 

2004లో మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెంట్ క్లబ్ తరుపున 34 బంతుల్లో సెంచరీ బాదాడు ఆండ్రూ సైమండ్స్. ఇప్పటిదాకా టీ20 బ్లాస్ట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. 19 ఏళ్ల తర్వాత ఆ రికార్డును సమం చేశాడు సీన్ అబ్బాట్.. 

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ తరుపున ఆడిన సామ్ కుర్రాన్, సుర్రే టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. విల్స్ జాక్స్ 17, లారీ ఇవెన్స్ 11, సామ్ కుర్రాన్ 15, టామ్ కుర్రాన్ 16, జమీ స్మిత్ 17 పరుగులు చేయగా జోర్డాన్ క్లార్క్ 29 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది సుర్రే.

తువాండా ముయేయే 59, డానియల్ బెల్ డ్రుమోండ్ 52 పరుగులు చేసి మిగిలిన బ్యాటర్లు ఫెయిల్ అవ్వడంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసిన కెంట్, 41 పరుగుల తేడాతో ఓడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios