Asianet News TeluguAsianet News Telugu

T 20 world cup: ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌పై నరాలు తెగే ఉత్కంఠ... జోరుగా బెట్టింగ్, చేతులు మారనున్న కోట్లు

టీ 20 ప్రపంచకప్‌‌లో (t20 world cup) భాగంగా భారత్- పాకిస్తాన్‌ల (india pakistan match) మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్‌‌పై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పాకిస్తాన్‌పై వెయ్యికి రూ.1,600... భారత్ గెలిస్తే వెయ్యికి రూ.2 వేలు ఇస్తామంటూ బెట్టింగ్ రాయుళ్లు ఆశ చూపుతున్నారు

T 20 World Cup India Vs Pakistan Betting in Crores
Author
Hyderabad, First Published Oct 23, 2021, 6:13 PM IST

టీ 20 ప్రపంచకప్‌‌లో (t20 world cup) భాగంగా భారత్- పాకిస్తాన్‌ల (india pakistan match) మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్‌ కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అస‌లు సిస‌లైన క్రికెట్ మ‌జాను ఆస్వాదించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేపు ఆదివారం కావడంతో చాలా మంది మ్యాచ్ ను చూసే అవ‌కాశం ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో (hyderabad) ఈ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పాకిస్తాన్‌పై వెయ్యికి రూ.1,600... భారత్ గెలిస్తే వెయ్యికి రూ.2 వేలు ఇస్తామంటూ బెట్టింగ్ రాయుళ్లు ఆశ చూపుతున్నారు. టాస్ నుంచి మొదలుకొని ఏ బ్యాట్స్‌మెన్ ఎంత కొడతాడనే దానిపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు హైద‌రాబాద్‌లోని రెస్టారెంట్లు, బార్లు, హోట‌ళ్లలో పెద్ద తెరలపై క్రికెట్ ప్ర‌సారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లలో ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే పలు పబ్‌లలోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్‌సీయూలో విద్యార్థి సంఘాలు భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశాయి. మ‌రోవైపు, టీ20 సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచులు తొలిసారి మల్టీప్లెక్స్‌ల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యే అవ‌కాశం ఉంది. ప్ర‌పంచ క‌ప్ చివ‌రి దశ మ్యాచ్‌లకల్లా ఇవి అందుబాటులోకి వ‌స్తాయ‌ని మల్టీప్లెక్స్‌ సిబ్బంది తెలిపారు.

కాగా... భారత్- పాకిస్తాన్‌ సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని సామాజిక మాధ్యమాలతో పాటు రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ (giriraj singh chauhan) కూడా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ను రద్దు చేయాలని కోరారు. 

ALso Read:India vs Pakistan: వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. భారత్-పాక్ మ్యాచ్ పై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ

ట్విట్టర్ లో #Banpakcricket హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ (tarkishore prasad) కూడా మ్యాచ్ రద్దు చేయాలని కోరే వారికి మద్దతు పలికారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (asaduddin owaisi) కూడా ఈ మ్యాచ్ పై స్పందించారు. బోర్డర్ లో భారత సైనికులు (indian army) చచ్చిపోతుంటే పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటం అవసరమా..? అని ప్రధాని మోడీని (narendra modi) ప్రశ్నించారు. దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఇదే విషయమై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (rajeev shukla) మాట్లాడుతూ.. ‘జమ్మూ కాశ్మీర్ లో (jammu and kashmir) జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రసంస్థలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios