26 జనవరి మధ్యాహ్నం 12 గంటలకు కర్ణాటక, పంజాబ్ మధ్య తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్...సాయంత్రం 7 గంటలకు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ మధ్య రెండో క్వార్టర్ ఫైనల్27 జనవరి మధ్యాహ్నం 12 గంటలకు హర్యానా, బరోడా మధ్య మూడో క్వార్టర్ ఫైనల్,సాయంత్రం 7 గంటలకు బీహార్, రాజస్థాన్ మధ్య నాలుగో క్వార్టర్ ఫైనల్... 

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ 2020-21 సీజన్ క్వార్టర్ ఫైనల్ తేదీలను ప్రకటించింది బీసీసీఐ. జనవరి 26 రిప్లబ్లిక్ తేదీ రోజున రెండు, 27 జనవరిన మరో రెండు మ్యాచులు జరగనున్నాయి.

26 జనవరి మధ్యాహ్నం 12 గంటలకు కర్ణాటక, పంజాబ్ మధ్య తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది.
27 జనవరి మధ్యాహ్నం 12 గంటలకు హర్యానా, బరోడా మధ్య మూడో క్వార్టర్ ఫైనల్, సాయంత్రం 7 గంటలకు బీహార్, రాజస్థాన్ మధ్య నాలుగో క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది.

క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచులన్నీ అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం మొతెరాలోనే జరగనున్నాయి. 29 జనవరి మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సెమీస్, సాయంత్రం 7 గంటలకు రెండో సెమీఫైనల్స్ జరుగుతాయి. 31 జనవరి తేదీన సాయంత్రం 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది.