మహేంద్ర సింగ్ ధోనీతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన సురేష్ రైనా... మాల్దీవుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన బర్త్‌డే వేడుకలను మాల్దీవుల్లో ప్లాన్ చేసిన రైనా, కుటుంబంతో కలిసి అక్కడ వాలిపోయడు.

మాల్దీవుల్లో అత్యంత విలాసవంతమైన హెరిటాన్స్ ఆరాలో లగ్జరీ సూట్ తీసుకున్న రైనా... అక్కడ భార్యా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సురేష్ రైనా భార్య ప్రియాంక రైనా తండ్రి మరణంతో ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కాకముందే స్వదేశానికి వచ్చేసిన ఈ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్... ఇప్పుడు కుటుంబానికి తన సమయాన్నంతా వెచ్చిస్తున్నాడు.

మాల్దీవుల్లో సాగర విహారం కోసం డాల్ఫిన్స్‌తో ఆడుకుంటూ, ఖరీదైన బ్రేక్ ఫాస్ట ఆరగిస్తూ... భార్యతో కలిసి పారాసైలింగ్ చేస్తూ... ఎంజాయ్‌మెంట్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు చూపిస్తున్నాడు సురేష్ రైనా. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suresh Raina (@sureshraina3)