Asianet News TeluguAsianet News Telugu

కొత్త సీజన్, కొత్త కెప్టెన్, సరికొత్త జెర్సీ... ఆరెంజ్ ఆర్మీకి నలుపు రంగుని అద్దిన సన్‌రైజర్స్...

సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్‌ని పోలినట్టుగా ఆరెంజ్ జెర్సీకి బ్లాక్ కలరింగ్ ఇచ్చిన ఎస్‌ఆర్‌హెచ్... అయిడిన్ మార్క్‌రమ్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2023 సీజన్ ఆడబోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. 

Sunrisers Hyderabad revealed new jersey for IPL 2023 season, Orange Army cra
Author
First Published Mar 16, 2023, 12:01 PM IST

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓ సెపరేట్ సంస్కృతి ఉంటుంది. దాదాపు ఒకే కోర్ టీమ్‌ని సీజన్ల పాటు పొడగించడం, వేలానికి ఛాయ్ బిస్కెట్లు తినడానికి తప్ప, ప్లేయర్లను కొనుగోలు చేయడానికి వెళ్లకపోవడం ఆరెంజ్ ఆర్మీ టీమ్‌కి బాగా అలవాటు. అయితే ఐపీఎల్ 2022 ముందు వరకూ ఒక లెక్క, 2023 నుంచి ఒక లెక్క... అన్నట్టుగా ఈసారి టీమ్ విషయంలో చాలా కసరత్తులు చేస్తోంది సన్‌రైజర్స్ హైదరాబాద్...

ఐపీఎల్ 2023 సీజన్ కోసం అయిడిన్ మార్క్‌రమ్‌ని కెప్టెన్‌గా ఎంచుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2015 తర్వాత డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్... ఇద్దరూ సన్‌రైజర్స్‌ని నడిపిస్తూ వచ్చారు. అయితే 2021లో డేవిడ్ వార్నర్‌ని టీమ్‌ నుంచి పంపించిన సన్‌రైజర్స్, 2022 ఐపీఎల్ ముగిసిన తర్వాత కేన్ మామకి కూడా గుడ్‌బై చెప్పేసింది...

ఏళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన రషీద్ ఖాన్ కూడా వేరే టీమ్‌కి వెళ్లిపోయాడు. కొత్త టీమ్‌తో కొత్త సీజన్‌ని సరికొత్తగా ఆరంభించాలని అనుకుంటున్న ఆరెంజ్ ఆర్మీ, ఐపీఎల్ 2023 సీజన్ కోసం జెర్సీని ఆవిష్కరించింది...

పాత ఆరెంజ్ ఆర్మీ జెర్సీలో సమూలమైన మార్పులు చేయకుండా మొట్టమొదటి సౌతాఫ్రికా20 లీగ్‌లో టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జెర్సీని పోలినట్టుగా కాషాయానికి నల్లరంగును అద్దింది...

సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్‌ని టైటిల్ విజేతగా నిలిచిన అయిడిన్ మార్క్‌రమ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు..

ఇంగ్లాండ్ స్టార్ హారీ బ్రూక్‌ని రూ.13 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, భారత స్టార్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ని రూ.8 కోట్ల 25 లక్షలకు దక్కించుకుంది. అలాగే సఫారీ ప్లేయర్ హెరీచ్ క్లాసిన్‌ని రూ.5 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసిన ఆరెంజ్ ఆర్మీ... వివ్‌రాంత్ శర్మ కోసం రూ.2 కోట్ల 60 లక్షలు, అదిల్ రషీద్ కోసం రూ.2 కోట్లు పెట్టింది.

అలాగే మయాంక్ దగర్‌ని రూ.1 కోటి 80 లక్షలకు, అకీల్ హుస్సేన్‌ని కోటి రూపాయలకు దక్కించుకుంది. ఐపీఎల్ 2023 వేలంలో 13 ప్లేయర్లను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇంకా పర్సులో రూ.6.55 కోట్లు మిగిలించుకుంది...

ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది: అయిడిన్ మార్క్‌రమ్, హారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెరిచ్ క్లాసిన్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్‌హక్ ఫరూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, వివ్‌రాంత్ శర్మ, అదిల్ రషీద్, మయాంక్ దగర్, అకీల్ హుస్సేన్, మయాంక్ మర్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, సన్వీర్ సింగ్, సమర్థ్ వ్యాస్

Follow Us:
Download App:
  • android
  • ios