వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సన్‌రైజర్స్ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. ఆదివారం హైదరాబాద్‌లో ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 39 పరుగులతో ఓడిపోయింది.

దీంతో ఈ ఓటమిపై స్పందించాడు సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్. బౌలింగ్‌లో మేం అద్భుతంగా రాణించామని.. కానీ బ్యాటింగ్‌లో తడబడ్డామని అభిప్రాయపడ్డాడు. మా వైఫల్యాలను ఢిల్లీ ఆటగాళ్లు అందిపుచ్చుకుని అద్భుతంగా చెలరేగారన్నాడు.

ఏ జట్టును తక్కువగా అంచనా వేయకూడదని.. ముఖ్యంగా ఐపీఎల్‌లో అయితే టోర్నీలో ఏ జట్టైనా ఎవరినైనా ఓడించవచ్చని వ్యాఖ్యానించాడు. మన ఆట, ప్రణాళికలను మాత్రం అమలు చేయాలని... మా ఓపెనర్లు అద్భుతంగా రాణించారని కానీ ఢిల్లీ తమకన్నా అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు. తన తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్ .. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో బుధవారం తలపడనుంది.