Asianet News TeluguAsianet News Telugu

SRHvsDC: చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్... సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్...

గబ్బర్ సూపర్ ఇన్నింగ్స్... మొదటి వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం...

క్యాచులు జారవిడిచిన సన్‌రైజర్స్ ఫీల్డర్లు...

హెట్మయర్, స్టోయినిస్ మెరుపులు...భారీగా పరుగులు ఇచ్చిన హోల్డర్ అండ్ కో...

 

 

Sunrisers bowlers failed in key match, delhi capitals set big target for Orange army CRA
Author
India, First Published Nov 8, 2020, 9:18 PM IST

IPL 2020 సీజన్‌ మొదటి క్వాలిఫైయర్‌లో సున్నాకే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... ఫైనల్ కల నెరవేరాలంటే తప్పక గెలవాల్సిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోియ 189 పరుగుల భారీ స్కోరు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

ఓపెనర్‌గా వచ్చిన స్టోయినిస్, శిఖర్ ధావన్ కలిసి మొదటి వికెట్‌కి 86 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసి అవుట్ కాగా... కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 20 బంతుల్లో ఓ ఫోర్‌తో 21 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులు చేయగా... హెట్మయర్ 22 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్లతో 42 పరుగులు చేశారు.

తేలికపాటి క్యాచులను కూడా జారవిడిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, బౌలింగ్‌లోనూ ధారళంగా పరుగులు ఇచ్చి భారీ మూల్యం చెల్లించుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ తలా ఓ వికెట్ తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios