Asianet News TeluguAsianet News Telugu

అల్లుడి సెంచరీపై స్పందించిన సునీల్ శెట్టి... ‘బాగా ఆడావ్ బాబా’ అంటూ...

మక్కా ఆఫ్ క్రికెట్‌లో సెంచరీ... బాగా ఆడావ్ బాబా’ అంటూ లవ్ సింబల్ ట్వీట్ చేసిన సునీల్ శెట్టి... ప్రస్తుతం కెఎల్ రాహుల్‌తో కలిసి ఇంగ్లాండ్‌లోనే ఉంటున్న సునీల్ శెట్టి కూతురు అథియా శెట్టి...

Suniel Shetty responds on KL Rahul Century, rumored girlfriend athiya shetty
Author
India, First Published Aug 13, 2021, 5:53 PM IST

టీమిండియా క్లాస్ ప్లేయర్ కెఎల్ రాహుల్... మూడు ఫార్మాట్లలో అదరగొడుతూ దూసుకుపోతున్నాడు. మయాంక్ అగర్వాల్ నెట్స్‌లో గాయపడడంతో అనుకోకుండా దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్... మొదటి టెస్టులో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు.

రెండో టెస్టులో సెంచరీతో చెలరేగి, టెస్టు ఫార్మాట్‌లోనూ జట్టులో తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నాడు... క్లాస్ సెంచరీతో ఆకట్టుకున్న కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌పై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా స్పందించాడు. ‘మక్కా ఆఫ్ క్రికెట్‌లో సెంచరీ... బాగా ఆడావ్ బాబా’ అంటూ లవ్ సింబల్ ట్వీట్ చేశాడు సునీల్ శెట్టి.

సునీల్ శెట్టి కూతురు అథియా శెట్టితో కెఎల్ రాహుల్ డేటింగ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోనే ఉన్న అథియా శెట్టి... కెఎల్ రాహుల్‌తో కలిసే ఉంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యే ఫోటోల ద్వారా తెలుస్తోంది. అథియాతో పాటు ఆమె సోదరుడు కూడా ఉన్నాడని సునీల్ శెట్టి కామెంట్ చేశాడు.

ఈ ఇద్దరి ప్రేమకి సునీల్ శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, త్వరలోనే మరో బాలీవుడ్ క్రికెట్ జోడీని టీమిండియాలో చూడబోతున్నామని టాక్ వినబడుతోంది. కెఎల్ రాహుల్‌ను ‘బాబా’ అంటూ అప్యాయంగా పిలిచాడంటే.. సునీల్ కూడా తన కూతురికి, ఈ యంగ్ క్రికెటరే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడని తెలుస్తోందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... అల్లుడు కెఎల్ రాహుల్ సెంచరీ చేసిన రోజే, మామ సునీల్ శెట్టి పుట్టినరోజు కూడా కావడంతో తన సెంచరీతో మామకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు నెటిజన్లు.

Follow Us:
Download App:
  • android
  • ios