IPL 2023:  టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మాజీ ప్రేయసి (?)   ఊర్వశి రౌతేలా  మరోసారి అతడి ఫ్యాన్స్ పై ఫైర్ అయింది. తననెందుకు వివాదంలోకి లాగుతారంటూ..

గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) లో రికవరీ అవుతున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మిస్ అవుతున్నది. పంత్ లేకపోవడంతో ఆ జట్టు ఈసారి పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. అయితే పంత్ ఫ్యాన్స్ కొందరు ఇప్పటికీ ఢిల్లీ మ్యాచ్ లు జరుతున్నప్పుడు అతడి మాజీ ప్రేయసి (?), బాలీవుడ్ వర్ధమాన నటి ఊర్వశి రౌతేలా ను టార్గెట్ చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ ఫ్యాన్ కూడా ఊర్వశిని లైవ్ వీడియోలో తిట్టిపోశాడు. 

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ - హైదరాబాద్ మధ్య ముగిసిన మ్యాచ్ లో ఓ అభిమాని లైవ్ వీడియోలో అక్షర్ పటేల్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ‘అక్షర్ భాయ్.. రిషభ్ పంత్ కు మేమంతా మద్దతుగా ఉన్నాం. అతడికి ఈ విషయం చెప్పండి. ఊర్వశి రటోలాను వదిలేదే లేదు..’అని చెప్పాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

తాజాగా ఈ వీడియోపై ఊర్వశి స్పందించింది. ‘నా ఇంటిపేరును కూనీ చేయడం ఆపండి. అది నాకెంతో విలువైంది. కొన్ని పదాలకు అర్థాలుంటాయి. ఇంటిపేర్లు చాలా మందికి ప్రత్యేకం. ఇంటిపేర్లకు చాలా పవర్స్, బ్లెస్సింగ్స్ ఉంటాయి’ అని ఐడోంట్ లైక్ ఇట్, నాట్ ఫన్నీ అనే హ్యాష్ ట్యాగ్స్ తో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

Scroll to load tweet…

ఇక గతేడాది రిషభ్ - ఊర్వశిల మధ్య జరిగిన సోషల్ మీడియా వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఊర్వశి ఓ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ రిషభ్ పేరును ప్రత్యేకంగా తీసుకురాకున్నా ‘మిస్టర్ ఆర్‌పీ’అని సంబోధిస్తూ కామెంట్స్ చేయడం.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పడం దానికి పంత్ కూడా తన ఇన్‌స్టా స్టోరీస్ లో ఊర్వశికి కౌంటర్ గా కోట్స్ షేర్ చేయడంతో నానా రచ్చ జరిగింది. ఇదే క్రమంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఊర్వశి ఆసీస్ కు వెళ్లడం పంత్ ను కాకపట్టడానికేనన్న వాదనలూ వినిపించాయి. పంత్ యాక్స్డెంట్ తర్వాత తరుచూ ఏదో ఒక రకంగా ఆమె అతడిని పరోక్షంగా ప్రస్తావిస్తూనే ఉండటం అతడి అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది.