Asianet News TeluguAsianet News Telugu

భార్య చేతిలో ఓటమి.. స్టీవ్ స్మిత్ పై ట్రోల్స్

తాజాగా..  ఆసిస్ టాప్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ భార్య డానీ విల్స్  సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.

Steve Smith's Wife Hilariously Trolls Him After Defeating Him In Video Game
Author
Hyderabad, First Published Apr 24, 2020, 10:27 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.

దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న మొదట్లొ క్రీడాకారులంతా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ఒకరిపై మరొకరు విసిరారు.

కాగా... ఎవరికి వారు ఏదో ఒక టైంపాస్ క్రియేట్ చేసుకొని సరదాగా గడుపుతున్నారు. వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా..  ఆసిస్ టాప్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ భార్య డానీ విల్స్  సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.

ఆ వీడియో చాలా ఫన్నీగా ఉంది. దాంట్లో.. స్టీవ్ స్మిత్.. తన భార్యతో కలిసి వీడియో గేమ్ ఆడాడు. అయితే.. ఆ గేమ్ లో స్మిత్ ఓడిపోయాడు. అంతే.. ఇక అతనిని భార్య విపరీతంగా ట్రోల్ చేసింది. ఓటమి తర్వాత వారి మధ్య జరిగిన సంభాషణ మొత్తం ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. స్మిత్ వీడియో గేమ్ ఓడిపోయి చాలా అప్ సెట్ అయ్యాడని ఆమె పేర్కొన్నారు. గేమ్ అయిపోయిన వెంటనే స్మిత్ ని ఆయన భార్య.. నువ్వు బాగా ఎంజాయ్ చేశావా అని అడిగిందట. దానికి స్మిత్ లేదు అని సమాధానం ఇచ్చారు. ఎందుకు అని ప్రశ్నిస్తే.. నేను ఓడిపోయాను కదా అని సమాధానం ఇచ్చాడు. వారి సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకట్టకుంటోంది.

కాగా.. గతవారం స్మిత్.. ఇంట్లోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios