Asianet News TeluguAsianet News Telugu

ఇంటిని అద్దెకిచ్చిన స్టీవ్ స్మిత్... వారానికి ఎంత వసూలు చేస్తున్నాడంటే..

ఈ విలాసవంతమైన ఇంటిని నలుపు, గోధుమ రంగుల కలయికతో స్మిత్ అలంకరించాడు. ఇందులో ఓపెన్ కిచెన్‌తో పాటు.. ఓపెన్ డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. లామినేటెడ్ ఫ్లోరింగ్‌తో ఉన్న ఈ ఇంటిలో పెద్ద స్లైడింగ్ డోర్లను అమర్చారు. 

Steve Smith puts up his luxurious home in Sydney for rent for $2000 per week
Author
Hyderabad, First Published Feb 22, 2020, 7:49 AM IST


ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ న్యూస్ హెడ్ లైన్స్ లో నిలిచాడు. ఎప్పుడూ అతని ఆట గురించో, రికార్డుల గురించో మనం వార్తలు చదివి ఉంటాం.  అయితే.. క్రికెట్ తో సంబంధం లేకుండా.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు స్టీవ్ స్మిత్. ఇంతకీ స్మిత్ ఏం చేశాడు అనుకుంటున్నారా..? తన విలాసవంతమైన ఇంటిని అద్దెకు ఇచ్చాడు.

2015లో 2 మిలియన్ డాలర్లు వెచ్చించి.. సిడ్నీలో మూడు బెడ్‌రూంలో, బాత్ రూంలతో కూడిన ఈ ఇంటిని అతను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత తన ఇష్టానుసారంగా ఇంటిలో మార్పులు చేశాడు. ఇప్పుడు ఈ ఇంటిని మరొకరికి అద్దెకు ఇచ్చాడు. వారానికి  2వేల డాలర్లు అద్దెగా వసూలు చేస్తుండటం గమనార్హం.

Also Read అలా బంతి విసిరా: విరాట్ కోహ్లీని ఔట్ చేసిన తీరుపై జెమీసన్...

ఈ విలాసవంతమైన ఇంటిని నలుపు, గోధుమ రంగుల కలయికతో స్మిత్ అలంకరించాడు. ఇందులో ఓపెన్ కిచెన్‌తో పాటు.. ఓపెన్ డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. లామినేటెడ్ ఫ్లోరింగ్‌తో ఉన్న ఈ ఇంటిలో పెద్ద స్లైడింగ్ డోర్లను అమర్చారు. తద్వారా లాంగ్‌లోకి సూర్యురశ్మి ప్రవేశిస్తుంది. అంతేకాక ఈ ఇంటిలోని ప్రతి గది నుంచి సిడ్నీలో ప్రతిష్టాత్మక కట్టడం హార్బర్ బ్రిడ్జిని చూడొచ్చు. 


అయితే స్మిత్‌కు ఇది ఒకటే విలాసవంతమైన ఇల్లు కాదు. మారిక్‌విల్లేలో, సాన్ సౌచీలో, బ్రిచ్‌గ్రోవ్‌లోనూ స్మిత్‌కి విలాసవంతమైన ఇల్లు ఉన్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. 2018లో స్మిత్ తన ఇంటిని 250 డాలర్లుకు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 2019లో అతను పది డాలర్లు పెంచాడు. కానీ, 2020లో అదే ఇంటికి ఏకంగా వారానికి 2వేల డాలర్ల అద్దె రావడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios