Asianet News TeluguAsianet News Telugu

స్టీవ్ స్మిత్ రనౌట్ విషయంలో హై డ్రామా! నాకు అర్థం కాలేదు సార్! అంటున్న స్టువర్ట్ బ్రాడ్...

71 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్! రనౌట్ అయినా నాటౌట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్..  అంపైర్ నితిన్ మీనన్ నిర్ణయంపై క్రికెట్ ఫ్యాన్స్ హర్షం...

 

Steve Smith missed Run-out, The Ashes 2023, England vs Australia, Stuart Broad Responds CRA
Author
First Published Jul 29, 2023, 5:52 PM IST

యాషెస్ సిరీస్‌లో భాగంగా కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్టులోనూ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజా దక్కుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 54.4 ఓవర్లలో 283 పరుగులకి ఆలౌట్ అయ్యింది. హారీ బ్రూక్ 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేయగా బెన్ డక్లెట్ 41, క్రిస్ వోక్స్ 36, మొయిన్ ఆలీ 34, మార్క్ వుడ్ 28 పరుగులు చేశారు..

మిచెల్ స్టార్క్ 4 వికెట్లు తీయగా జోష్ హజల్‌వుడ్, టాడ్ ముర్ఫీలకు రెండేసి వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 103.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి 295 పరుగులు చేసంది. డేవిడ్ వార్నర్ 24 పరుగులు చేయగా ఉస్మాన్ ఖవాజా 157 బంతుల్లో 7 ఫోర్లతో 47 పరుగులు చేశాడు..

ఇప్పటికే సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా, ఈ టెస్టులో గెలవకపోయినా కనీసం డ్రా చేసి టెస్టు సిరీస్‌ని సొంతం చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మార్నస్ లబుషేన్ జిడ్డు బ్యాటింగ్‌‌కి దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. 82 బంతులు ఆడిన మార్నస్ లబుషేన్, 9 పరుగులు మాత్రమే చేశాడు. లబుషేన్ బ్యాటింగ్ స్ట్రైయిక్ రేటు 10.98 మాత్రమే..

ట్రావిస్ హెడ్ 4 పరుగులు చేయగా మిచెల్ మార్ష్ 16, అలెక్స్ క్యారీ 10, మిచెల్ స్టార్క్ 7 పరుగులు చేశారు. 123 బంతుల్లో 6 ఫోర్లతో 71 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ప్యాట్ కమ్మిన్స్ 36, టాడ్ ముర్ఫీ 34 పరుగులు చేయగా జోష్ హజల్‌వుడ్ 6 పరుగులు చేశాడు..

అయితే ఇన్నింగ్స్ 78వ ఓవర్‌లో స్టీవ్ స్మిత్ రనౌట్ నుంచి తప్పుకున్నాడు. స్టీవ్ స్మిత్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రెండో పరుగు కోసం ప్రయత్నించగా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జార్జ్ ఎల్హమ్ వేసిన త్రోని అందుకున్న ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో వికెట్లను గిరాటేశాడు...

టీవీ రిప్లైలో స్టీవ్ స్మిత్ బ్యాటు గీత దాటడానికి ముందే వికెట్లు గిరాటేసినట్టు కనిపించింది. తాను అవుటైనట్టు ఫిక్స్ అయిన స్టీవ్ స్మిత్ నిరాశగా పెవిలియన్ వైపు కదిలాడు కూడా. ఇంగ్లాండ్ టీమ్, వికెట్ పడినందుకు సెలబ్రేట్ కూడా చేసుకుంది. అయితే టీవీ రిప్లైను చాలా సార్లు చూసిన భారత అంపైర్ నితిన్ మీనన్, స్టీవ్ స్మిత్ గీత దాటడానికి ముందు వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో వికెట్లను కొట్టినా... బెయిల్స్ కదిలే సమయానికి అతని బ్యాటు లోపలికి వచ్చిందని నిర్ధారణకు వచ్చి... ‘నాటౌట్‌’గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో ఇంగ్లాండ్ టీమ్‌ షాక్ అయ్యింది...

క్రికెట్‌కి సంబంధించిన ప్రతీ విషయమై స్పందించి, తన తెలివిని ప్రదర్శించే స్టువర్ట్ బ్రాడ్... ‘నాకు నిజంగా ఈ రూల్స్ తెలీదు. స్టీవ్ స్మిత్ చాలా వెనక ఉన్నాడని మాత్రం కనిపించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద స్మిత్‌కి లైఫ్ దక్కిందని అనుకున్నా. అయితే కుమార్ ధర్మసేనని అడిగితే...లైన్ దాటేలోపు వికెట్ బెయిల్స్ కదలలేదని చెప్పాడు.. ఇంత క్లియర్‌గా చూస్తారా? అనే విషయం ఇప్పుడే తెలిసింది..’ అంటూ కామెంట్ చేశాడు.. 

Follow Us:
Download App:
  • android
  • ios